Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.10.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 17-Oct-2022

దిన ధ్యానము(Telugu) 17.10.2022 (Youth Special)

 

అంశం:- యవ్వనురాల వినుము.

 

"మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు" - హెబ్రీయులకు 12:4

 

మన యొక్క జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించకుండా పాపం చెయ్యడం వలన దేవుని నుండి కోల్పోయే నాలుగు విషయాలను గూర్చి ద్యానిద్దాం.

 

1. దేవుని సన్నిధి.

క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. కాని మనం దైర్యంగా పాపం చేసినప్పుడు మనం దేవుని సన్నిధిని కోల్పోతాము. క్రమముగా పరిశుద్ధ గ్రంధం ధ్యానించ లేము ప్రార్థన చెయ్యలేము. అందువలన ఆత్మీయ జీవితంలో వెనుదిరిగి విశ్వాసి వలె మారే ప్రమాదం ఉంది. 

 

2. విశ్వాసం.

యాకోబు 1:14లో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ వలన ఈడ్వబడి పురుకోల్పబడిన వాడై శోదించ బడును అని మనం చదువుతున్నాం. మనం పాపం చెయ్యడం వలన అపవాది వలలో చిక్కుకొని శోధనలకు గురి అవుతున్నాం. ఈ శోధనల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు పైన ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది. 

 

3. సమాధానం.

దేవుడిచ్చిన సమాధానం మనలో ఉంటేనే మనము మన చుట్టూ వున్న వారు సంతోషంగా జీవించ గలం. పాపం చేసి దేవుని సమాధానము కోల్పోయినప్పుడు మనస్సు కలత చెందుతుంది. గందరగోళం ఏర్పడుతుంది. ఇందువలన జీవితంలో సంతోషం లేని విధముగా ఏర్పడుతుంది. 

 

4. ఆశీర్వాదం.

మనం జీవించిన పాపపు జీవితం దేవున్ని దుఃఖ పరిచినప్పుడు ఆయన మనకొరకు ఉంచిన ఆశీర్వాదమును మనం స్వతంత్రించు కొనకుండా ఆటంకం కలుగ జేస్తుంది. ప్రభువు మన కొరకు ఉంచిన ప్రణాళికలు ఆలస్యం అవుతాయి. ప్రియమైన యవ్వనులారా పరిశుద్ధ గ్రంధంలో సమ్సోను మరియు యోసేపు అనే ఇద్దరు యవ్వనుల యొక్క జీవితం గురించి మనం ధ్యానించి నట్లయితే ఇద్దరూ కూడా దేవుడు ఏర్పరుచుకున్న పాత్రలే. యోసేపు అనే యవ్వనుడు పాపమును ఎదిరించి పోరాడి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన జీవితమును పొందుకొన్నాడు. కాని సమ్సోను అనే యవ్వనుడు మాత్రం పాపములో పడి గ్రహింపు లేని వాడై ఎదిరించుటకు పోరాడుటకు మనస్సు లేని వాడై దేవుని సన్నిధిని కోల్పోయి అనేకులకు హేళనగా మారి దేవుడు తనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును కోల్పోయి మరణించాడు. మనం మన సొంత బలముతో పాపము జయించలేము. శరీరానుసారముగా ప్రయత్నం చేసినప్పుడు మరలా అదే పాపములో పడే అవకాశం కలదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనలను ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపమును జయించే బలమును పరిశుద్ధాత్మ ప్రభువు మనకు ఇచ్చారు. పరిశుద్ధాత్ముని తోడుతో పాపమునకు విరోధముగా నిలబడి పోరాడి పరిశుద్ధ జీవితమును జీవించి విజయం పొందుకుందాం. హల్లేలూయా!

- శ్రీమతి. జాబకని శేఖర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి నెల సుమారుగా 47వేల మందికి పైగా చిన్న పిల్లలకు యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాము. ఆ వాక్యం వింటున్న చిన్న పిల్లలు దేవుని ప్రేమను గ్రహించి ఆ ప్రేమలో ఎదిగేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş