Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.10.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 15-Oct-2022

దిన ధ్యానము(Telugu) 16.10.2022 (Kids Special)

 

అంశం:- నువ్వే స్పెషల్.

 

"గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు" - మత్తయి 10:31

 

హాలో ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా? యేసయ్య దృష్టికి మీరు చాలా స్పెషల్. నన్ను నల్లగా ఉంది, పెద్ద కళ్ళు ఉన్నాయి, పొట్టిగా ఉంది అని అందరూ హేళన చేస్తారు. నేను స్పెషలా అని మీరు అడుగవచ్చు. చిన్న పిల్లలారా నిజముగా మిమ్మును చేసిన దేవుడు మీరు ప్రత్యేకమైన వారు అని పరిశుద్ధ గ్రంధంలో వ్రాసి ఉంచారు. చీ నేను చాలా అసహ్యంగా ఉన్నాను, నా వాయిస్ కూడా బాగోలేదు అని ఫీల్ అవుతున్న ఒక పక్షి కధ విందామా? ఒక పచ్చని దట్టమైన అడవిలో జంతువులు, పక్షులు ఒకటిగా జీవిస్తూ వస్తున్నాయి. మీరు కూడా స్కూల్లో మరియు ఇంట్లో ఒకటిగా ఉంటారా? కొన్ని సమయాల్లో గొడవ పడుతుంటారు కదా. అలాగైతే వెంటనే సమాధాన పడాలి ఓకేనా! కోతి ఒకటి ఒక చెట్టు మీదనుండి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ జాలిగా ఉంది. అదేసమయంలో క్రిందన గెంతు కుంటూ వచ్చిన కుందేలు ఏంటి కోతి అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది. నేను సర్కస్ లో నా వింతలు చూపించబోతున్నాను దానిని ఊహించు కొంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే గాని నువ్వు ఏంటి ఇంత మ్యాకప్ వేసుకున్నావు అని అడిగింది కోతి. ఈరోజు మన నక్క మామా ఇంట్లో ఫంక్షన్ అందులో నేను డాన్స్ చేయబోతున్నాను అని గెంతుతూ పారిపోయింది కుందేలు. దీనిని గమనిస్తున్న కాకి చాలా బాధ పడుతుంది. నాకు అందం చందం ఏదియు లేదు. దేవుడు నన్ను నల్లగా తయారు చేసాడు కనీసం నా వాయిస్ అయిన బాగుంటుంది అనుకొంటే నేను కావ్ కావ్ అని అరవడం మొదలు పెట్టగానే మనుష్యులు నన్ను వెంటాడి కొడుతున్నారు. ఎందుకు నేను పుట్టాను అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు కుహు కుహు అని కూస్తు కాకి పక్కకు వచ్చిన కోకిల హాయ్ బ్లాకి హౌ ఆర్ యు అంది నీకేంటి నీవు కూసే శబ్దము విని ప్రజలు నిన్ను చాలా ఇష్టపడతారు అని అన్నది కాకి. అందుకు కోకిల కాకులైన మీరే స్పెషల్ అని అన్నది. కాకులను చూడండి అవి విత్తవు కోయవు అని యేసు క్రీస్తు మిమ్మల్నే మనుష్యులకు ఉదాహరణగా తీసుకున్నారు. ఇప్పుడు చెప్పు నువ్వు స్పెషల్ కదా అని అడిగింది కోకిల. అందుకు కాకి హో అవునా ఇది నాకు తెలియకుండా పోయిందే. యేసుక్రీస్తు మాగురించి మాట్లాడారు అని ఆలోచిస్తేనే లెక్క లేనంత సంతోషం నాలో నిండిపోతుంది. ఇక మీదట నేను నా వాయిస్ గురించి ఆలోచించి బాధ పడను. ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని అన్నది కాకి. బాయ్ బ్లాకి అని చెప్పి కోకిల ఎగిరి పోయింది. 

 

ప్రియమైన పిల్లలారా కధ లో ఉన్న కాకి లాగా మీరు కూడా నాకు అందం లేదు బుద్ధి లేదు స్థిరం లేదు అని ఫీల్ అవుతున్నారా? కాకినే దేవుడు ఒక ఆలోచన కలిగి చేస్తే మరి మిమ్మల్ని దేవుడు ఇంకా చాలా పెద్ద ఆలోచన కలిగి ఉంటాడు కదా. కాబట్టి ఫీల్ అవ్వకండి. యేసయ్య చేతిలో మిమ్మల్ని మీరు సమర్పించు కొంటె మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. ఓకేనా! 

- శ్రీమతి. జీవా విజయ్ గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom