Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.10.2022
Share:

By Village Missionary Movement

Saturday, 15-Oct-2022

దిన ధ్యానము(Telugu) 15.10.2022

 

అంశం:- నివేదించడం.

 

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" - సామెతలు 28:13

 

జాన్ మరియు మేరీ తోబుట్టువులు. సెలవుల్లో వారు వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు. వారి అమ్మమ్మ గారి ఇంట్లో కోళ్లు, మేకలు, బాతులు ఉంటాయి. ఇంటికి వెళ్లినందుకు వారి అమ్మమ్మ రకరకాలైన రుచికరమైన వంటలు వారిద్దరికీ వండి పెడతారు. ఒక రోజు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు జాన్ ఒక బాతు పిల్లను పట్టుకొని అడుకొంటున్నాడు. ఊహించని విధముగా ఆ బాతు చనిపోయింది. వెంటనే జాన్ బయపడి చుట్టూ చూసాడు. ఎవ్వరు కనబడలేదు వెంటనే జాన్ ఒక గొయ్యి తవ్వి ఆ చనిపోయిన బాతును అందులో పెట్టి కప్పేసాడు. హమ్మయ్య ఎవరు చూడలేదు అనుకొని వెనక్కి తిరిగి చూసేసరికి హవాక్కయ్యాడు వెనకాల మేరీ నిలబడి ఉంది. వెంటనే మేరీ అమ్మమ్మ కు చెప్పేస్తాను అని బయపెట్టింది. జాన్ ఆమె దగ్గర ఏడ్చి నందున ఆమె అమ్మమ్మ దగ్గర చెప్పలేదు. 

 

ఆ రాత్రి వాళ్ళ అమ్మమ్మ మంచి సువాసన కరమైన లడ్డూలు మరియు పలహారాలు చేసి పెట్టింది. అవి చాలా రుచికరంగా ఉండడంతో వెంటనే మేరీ జాన్ ప్లేట్ లోని కొంత భాగం తీసుకొంది. వెంటనే జాన్ నేను అమ్మమ్మకు చెప్తాను అన్నాడు దానికి మేరీ నేను కూడా బాతు సంగతి అమ్మమకు చెబుతాను అన్నది. అప్పటి నుండి ప్రతి సారి నేను బాతు గురించి చెప్తాను అని బెదిరిస్తూ వస్తుంది. ఆ రాత్రి జాన్ ఆలోచింది అమ్మమ్మ దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి క్షమాపణ అడిగాడు. అందుకు వాళ్ళ అమ్మమ్మ కూడా క్షమించారు. తరువాత నుండి జాన్ మేరికి బయపడలేదు. 

 

పరిశుద్ధ గ్రంధంలో 2వ సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు ఒక పెద్ద తప్పు చేయుటను మనం చూస్తున్నాం. ఇది దేవుని దృష్టికి చెడ్డది. ఊరియాను చంపి అతని భార్య అయిన బత్షెబాను తన భార్యగా చేసుకున్నాడు. దేవుడు ఆ పాపాన్ని దీర్ఘదర్శి ప్రవక్త అయిన నాతాను ద్వారా తెలియజేసినప్పుడు దావీదు క్షమించమని అడిగాడు. అంతే కాకుండా మనం అందరం అర్థం చేసుకునేలా కీర్తన పాడి తన తప్పును బహిరంగంగా అంగీకరించాడు. 

 

అవును ప్రియమైన వారలారా మనం అలా పాపములో జీవిస్తూ ఉంటే భయము, ఏడ్పు నష్టమే వుంటుంది. పాపము పోవాలి అంటే క్షమించుటకు క్రీస్తుకు అధికారం ఉంది కనుక ఆయన యొద్ద క్షమాపణ అడగాలి. కాని. మనం అలా చెయ్యకపోతే మన పాపాల భారం దాచిపెట్టి దానిని మోస్తూనే ఉంటే అది మన హృదయంలో గుచ్చు కొంటూనే ఉంటుంది. మనలను నిందించడానికి మనలను దేవుని నుండి వేరు చెయ్యడానికి అపవాది దానిని ఉపయోగిస్తాడు. కావున మన పాపముల కొరకు తన సొంత రక్తమును చిందించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క పాదముల పైన పెడదాం. దేవుని శాంతి పొంది శుఖ సంతోషాలతో జీవిద్దాం. అందులో ఉన్న ఆనందాన్ని చుట్టూ వున్న వారికి తెలియజేద్దాం. అదేవిధంగా ఈ రక్షణ కరమైన సమాచారాన్ని తెలియజేస్తూ అనేక మందిని పరమ కానానుకు చేరనిద్దాం. హల్లేలూయా!

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఈనాడు తమిళనాడులో గల అరియల్ ఊరు అనే సేవాస్థలములో జరగబోతున్న ఉజ్జీవమును ఆశించే వారి కూటమిలో దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తులు ఆటంకం లేకుండా వచ్చు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet