Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.10.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 12-Oct-2022

దిన ధ్యానము(Telugu) 13.10.2022

 

అంశం:- ఉజ్జీవం.

 

“నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను” - లూకా 12:49

 

పండిత రమాబాయి ఒక బ్రాహ్మణ స్త్రీ. ఈమె 1891వ సంవత్సరంలో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఈమె సమాజ సేవలో ఉన్నతమైన వారు. 1886వ సంవత్సరంలో ఏర్పడిన కరువు వలన తన తల్లిదండ్రులను కోల్పోయారు. ఈమె 22 సంవత్సరాల వయస్సులో బెంగాల్ కు చెందిన ఒక న్యాయవాదిని పెండ్లి చేసుకున్నారు. కాని తన భర్త పెండ్లి అయిన 19 నెలల తరువాత చనిపోయారు. తరువాత తనకు ఉన్న ఒకే ఒక సహోదరుడు కూడా మరణించాడు. రమబాయి యవ్వన విధవరాలు అయ్యారు. విధవరాళ్ళ యొక్క పునర్ వివాహాన్ని అంగీకరించని సమాజంలో పండిత రమబాయి క్రీస్తు కొరకు జీవిస్తూ వస్తున్నారు. 1899వ సంవత్సరంలో భారతదేశ ఉజ్జీవం కొరకు ప్రార్థనలో మరియు ఉపవాసములో ఎక్కువ సమయం గడిపారు. ఆమెలో ఉజ్జీవం కొరకు అయిన దాహం మరింత ఎక్కువ అయింది. తరువాత 10 మందితో కూడిన అనేక ప్రార్థనా గుంపులను ఏర్పరచింది. ఈ ప్రార్థనా గుంపులు భారతదేశంలో అందరూ రక్షించబడాలి అని మరియు భారతదేశం అంతటా పరిశుద్ధాత్మ కుమ్మరింప బడాలి అని ప్రార్ధించారు. ఆమె ద్వారా స్త్రీలలో గొప్ప చైతన్యం కలిగింది. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆషేరు గోత్రమునకు చెందిన పనూయేలు కుమార్తె అయిన అన్న అనే ఒక ప్రవక్తి ఉండేది. ఈమె తన భర్త తో ఏడేండ్లు సంసారం చేసి విధవరాలు అయ్యింది. ఆ తరువాత ఆమె తన జీవితం గురించి ఆలోచించ కుండా తన సొంత ప్రజల రక్షణ కొరకు తనను సమర్పించుకొని దేవాలయము విడువక ఉపవాస ప్రార్ధనలలో ప్రతి రోజు సేవచేయుచు వచ్చెను. 84 సంవత్సరాల వయస్సులో కూడా దేవాలయములో సేవ చేసింది ఈ అన్న. 

 

దీనిని వింటున్న దేవుని పిల్లలారా! మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? హిందూ కుటుంబాల్లో పుట్టి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను, భర్తను కోల్పోయి యవ్వనములో విధవరాలు అయిన పండిత రమాబాయి దేవుని కొరకు ఉత్సాహంగా లేచి భారతదేశంలో ఉజ్జీవం తీసుకొచ్చిన విధముగా మీ ద్వారా కూడా దేవుడు గొప్ప ఉజ్జీవము తీసుకొని వస్తారు. ఉజ్జీవం కొరకైన దాహం మీలో ఉన్నట్లు అయితే దేవుని అగ్ని ఈరోజే మిమ్మును తాకుతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని నేను ఏం చేయగలను అని కృంగి ఉన్నా సరే ఉజ్జీవపు నిప్పులా మేల్కొనండి. దేవుడు మిమ్మును అగ్ని వలె మండింప జేస్తారు. హల్లేలూయా!

- శ్రీమతి. రూబీ అరుణ్.

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యలో 790 సంపూర్ణ మిషనరీలు అందరిని దేవుడు అంత్యకాల ఉజ్జీవపు ఆయుధాలుగా వాడుకొనేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al