Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.10.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 12-Oct-2022

దిన ధ్యానము(Telugu) 12.10.2022

 

అంశం:- హృదయంలో నుండి ప్రార్థన.

 

"అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును" - సామెతలు 1:28

 

కళ చాలా రోజులు కష్టపడిన తరువాత ఇల్లు కట్టి ప్రతిష్టించుటకు సమీపంలో ఉన్న వారందరినీ పిలిచింది. కాని ఎదురింటి రాణిని మాత్రం ఆమె చూడటం కుదరలేదు. ఆదివారం ఆరాధనలో రాణి ని చూసి ఆరాధన ముగిసిన తరువాత ఇంటికి వెళ్లి తన ఇంటి ప్రతిష్టకు రమ్మని పిలిచింది. అప్పుడు వారు మాట్లాడుతూ ఉండగా రాణి నిన్ను చూడటానికి అవ్వడం లేదు అని కళ అడిగింది. అందుకు రాణి నేను కంపెనీలో పనిచేయడం వలన నేను చాలా బిజీగా వున్నాను. ప్రార్థనా కూటములకు రావడానికి కూడా సమయం దొరకడం లేదు అంది. అందుకు కళ అరగంట ప్రార్థన చెయ్యక పోయినా కొన్ని నిమిషాలు మనస్సులో ప్రార్థన చేసుకున్న అది ప్రార్ధనే కదా! ప్రార్థన అనేది తండ్రితో మనం మాట్లాడే మాటలు. పని చేస్తుండగా కూడా ప్రార్ధించ వచ్చు అన్నది. రాణి ఆలోచిస్తూ అవును అన్నట్టుగా తల ఊపింది. మనం బిజీగా వున్న ప్రపంచంలో జీవిస్తున్నాము. ప్రార్ధించుటకు నాకు సమయం లేదు అని మూల్గు చున్నాము. కుదిరిన కొన్ని నిమిషాలు అయిన మనస్సులో ప్రార్ధించవచ్చు. కాబట్టి ఇద్దరు ప్రార్థన చేయుటకు మందిరమునకు వెళ్ళారు. ఒకరు ఆ మందిరము లోపలకు వెళ్లకుండా దూరముగా నిలుచొని ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అని చిన్నగా ప్రార్ధించారు. వీరే నీతిమంతులుగా ఎంచబడ్డారు. ప్రార్థన చేసేందుకు సమయం, స్థలం అని వేటిని చూడకుండా హృదయంలో నుండి మనం ప్రార్థిస్తున్నామా అనేది ప్రాముఖ్యం. హృదయం అనే ఆలయంలో నుండి మనం ప్రార్థన చేసుకోవాలి. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనే వాక్యమును మరచిపోకూడదు. కుష్టు రోగి అయిన ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నీ చిత్తం అయితే నన్ను శుద్ధునిగా చేయడం అవుతుంది అని ప్రార్దించి ఆరోగ్యమును పొందుకొని వెళ్ళాడు. సిలువలో వేలాడు చుండగా ఒక దొంగ ప్రభువా మీరు మీ రాజ్యముతో వచ్చేటప్పుడు దాసుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ప్రార్దించి పరలోక రాజ్యమును పొందుకొన్నాడు. 

 

దీనిని వింటున్న ప్రియమైన వారలారా! ఏదో అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనం దేవున్ని వెతుకుతున్నాం. అది ముగిసిన వెంటనే కృతజ్ఞతలు చెప్పడం మరచిపోతాము. మరియు ఆయన స్వరమునకు ఆశక్తి చూపించకుండా అవసరానికి మాత్రమే ఆయనను వెతకడం వలన ఆయన ఆ ప్రార్ధనకు జవాబు ఇవ్వరు అని పరిశుద్ధ గ్రంధంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అందువలన దొరికిన సమయంలో దేవున్ని వెతుకుదాం ఆయనకు మొదటి స్థానం ఇద్దాం. నిజముగా దేవునికి ప్రార్దిద్దాం ఆశీర్వాదములను పొందుకుందాం. హల్లెలుయా!

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఆంధ్ర మరియు ఒడిశాలో 63 స్థలాల్లో ప్రజలు దేవున్ని అరాదించుటకు మందిరములు అవసరమై యున్నవి మందిరములు కట్టుటకు అవసరమైన సహాయం చేసే వ్యక్తులు లేచులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino betoffice casibom matbet matbet giriş