By Village Missionary Movement
Tuesday, 11-Oct-2022దిన ధ్యానము(Telugu) 11.10.2022
అంశం:- నిర్ణయం శాశ్వతం కాదు.
"అప్పుడు పౌలునీవు ఏ హానియు చేసికొనవద్దు" - అపోస్తులకార్యములు 16:28
దక్షిణ కొరియా దేశంలో ఉజ్జీవం కొరకు దేవుని ద్వారా వాడుకొనబడిన బోధకుడు పాల్ యాంగిచో. ఇతని సంఘంలో లక్షల కొలది విశ్వాసులు ఉన్న సమయంలో తనకు ఉండే సమస్య వలన భరించ లేక మెడ పైకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాడు. దేవుడు అతనిని సంధించి నీవు మేడ పైనుండి క్రిందకి దూకే ధైర్యం నీలో ఉన్నప్పుడు ఆ ధైర్యం పరిచర్యలో ఉపయోగించు అని అన్నారు. అప్పుడు ఆ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టారు. ఇంకొక సారి అతను సంఘం కట్టడానికి కొన్ని లక్షల డబ్బులను అప్పు తీసుకొని సంఘము కట్టి పూర్తి చేశారు. అతనికి అప్పు ఇచ్చిన వారు ఆ డబ్బులను అడగడంతో తాను లైసెన్సు పెట్టి కొన్న తుపాకీతో తనను తానే కాల్చుకొని చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఒక ఫోన్ కాల్ అతనికి వచ్చింది. ఆ ఫోన్లో ఒకతను నేను కార్లో ఉండి మీ వాక్యమును విన్నాను సంఘం కట్టుటకు ఇంత డబ్బులు మీకు అవసరం అని చెప్పారు మీకు కావాల్సినంత డబ్బులు తీసుకొని రేపటి దినమున మిమ్మును కలుసుకొనుటకు వస్తాను అని అన్నారు. వెంటనే పాల్ యాంగిచో తన యొక్క తుపాకిని క్రింద పడవేసి ప్రభువా వెర్రితనముగా నిర్ణయం తీసుకున్న నన్ను క్షమించు అని ప్రార్థన చేసాడు.
అపోస్తుల కార్యములు 16 వ అధ్యాయంలో మధ్య రాత్రివేళ పౌలు, సీలయు ప్రార్థన చేసినప్పుడు చెరసాల తలపులు తెరవబడ్డాయి. దానిని చూసిన చెరసాల నాయకుడు ఖైదీ లు పారిపోయారు అనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా చెప్పెను. వెంటనే పౌలు ఆ చెరసాల నాయకుడికి సువార్తను ప్రకటించి రక్షణలోనికి అతనిని నేరుగా నడిపించాడు అని మనం చదువుతున్నాం.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మనం అనుదినం వింటున్న ఒక వార్త ఏమనగా యవ్వన పిల్లల యొక్క ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఎటువంటి భరించలేని సమస్యలకైనా, పరిస్థితులకైన ఆత్మహత్య జవాబు కాదు. ప్రతి ఒక్క సమస్యకు జవాబు దొరికే ఒకే ఒక స్థలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదం మాత్రమే. మనం కోపంలో అనవసరమైన పట్టుదలతో తీసుకొనే పలు రకాల నిర్ణయాలు వేదనను మాత్రమే ఇస్తాయి. ఇది నిరంతరమైనది కాదు. ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ధైర్యమును బ్రతకడానికి ఉపయోగించండి. ప్రభువైన యేసు మీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. హల్లెలుయా!
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
ఆంధ్రప్రదేశ్ లో 6 స్థలాల్లో దేవుని ఆలయములు కట్టబడి అందులో ఆరాధనలు జరుగుచున్నవి, అందులో పాల్గొనే వ్యక్తులు దేవుని కొరకు క్రియ జరిగించే వీరులుగా మారేలా ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250