Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.10.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 09-Oct-2022

దిన ధ్యానము(Telugu) 10.10.2022 (Youth Special)

 

అంశం:- మనస్సు నూతన పరచబడితే.

 

"దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు" – 2 తిమోతికి 1:7

 

ఏ ఒక్క మానవుని హృదయమైన చాల రకములైన ఆలోచనలతో అక్రమించబడి ఆ ఆలోచనలను జరిగిస్తుంది. కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు సంరక్షించబడితేనే మానవ జాతి యొక్క క్రియలు తగినవై ఉంటాయి. జ్ఞానం లేని వారిని అపవాది చాలా సులువుగా దాడి చేసి తన లక్ష్యమును నెరవేర్చుటకు సాధనముగా మార్చగలడు. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి గలవరమై విశ్వాసముతో జయించు వారి వలె ఉండాలి. మానసిక ఆరోగ్య దినోత్సవం అయిన ఈనాడు దీనిని గూర్చి ఆలోచించడం అనేది సమయోచితముగా ఉంటుంది. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది కాని దొంగ అయిన అపవాది చంపుటకు, నాశనం చేయుటకు వస్తాడు కాబట్టి వ్యక్తిగత వ్యక్తుల యొక్క మన శాంతిని సమాధానము, సంతోషమును అల్లకల్లోలం చేసేస్తున్నాడు. అందువల్లనే ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యం బాధింప బడుతున్నది. శారీరిక క్రియలు పెరిగినప్పుడు సాతాను మనుష్యుని మనస్సును ఆక్రమించుకొని వాడు చెయ్యలి అనుకున్న అన్నింటిని చేయుటకు ఈ మనుష్యులను బొమ్మలుగా మార్చ గలడు. మానసికంగా ఎక్కువగా బాధింపబడేవారు తప్పుడు మనసాక్షి, ఇతరులచే అవమానించబడటం, సమస్యలను ఎదుర్కొలేకపోవడం. మరియు చిల్లంగి శక్తుల వలన ఆ స్థితికి దిగజార్చ బడుతున్నారు. నేనే స్థితిలో ఉన్న నన్ను ప్రేమించుటకు తండ్రి అయిన యేసు ఉన్నారు అనే ఆలోచన మాత్రమే మనుష్యుని యొక్క మనస్సును మార్చగలదు. క్రీస్తులో శరీరము పాప విషయమై మృతమైనప్పుడు మనిషిలో మంచి మనస్సు పొందుకొని మేలు చేత కీడును జయించగలరు. 

 

ప్రియమైన వారలారా! నూతనము మరియు జీవమును గూర్చి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ఈ విధముగా వివరిస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మాత్రమే ఈ మార్గములో ప్రవేసించ గలము. ప్రపంచంలో ఉన్న ఎంతో మంది మానసిక వైద్యులు స్వస్థ పరచలేని మానసిక రోగులను గొర్రె పిల్ల యొక్క రక్తము మరియు సాక్ష్యం గల వాక్యం మాత్రమే స్వస్థ పరచగలదు. మనం మరల పాత స్వభావము ప్రకారము నడుచుకొనుటకు దాస్యపు ఆత్మను పొందుకొన లేదు గాని దత్త పుత్ర ఆత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మొఱ్ఱ పెట్టు చున్నాము. ఈ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనలను మన బంధకముల నుండి విడిపించి లక్ష్యం వైపు చూస్తూ శుద్ధాత్మతో మనలను పరిగెత్త జేస్తుంది. కాబట్టి దేనినైనా ఎదిరించే ధైర్యము ఇచ్చే దేవుని ఆత్మను పొందుకొని ఆయన బలముతో మన జీవిత ప్రయాణంలో పరిగెడదాం. హల్లెలుయా!

- శ్రీమతి. మెర్సీ అలెక్స్అండ్ 

 

ప్రార్థన అంశం:-

ఆంధ్ర మరియు ఒడిశా రాష్ట్రలలో మనతో కలిసి పరిచర్య చేస్తున్న 86 మంది మిషనరీల కుటుంబం కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet