Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.02.2021
Share:

By Village Missionary Movement

Saturday, 13-Feb-2021

దిన ధ్యానము(Telugu) 13.02.2021

పౌలు అనే సౌలు.

"...వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను" - అపో.కార్యములు 26:18

తన స్కూల్ చదువులో అందరి కంటే ఆకరివాడు. ఈయన జీవితంలో పైకి రాడు, ఈయన దేనికి పనికి రాడు అని ఉపాధ్యాయులు అందరూ ఆ విద్యార్థిని తిట్టేవారు. లెక్కల్లో చాలా తక్కువ మార్కులు వచ్చేవి ఆ విద్యార్థికి. సరే చదువుల్లోనే రాణించ లేదు ఇంట్లో గల తోటను అయిన చక్కగా పరామర్శిస్తాడు అనుకుంటే దానికి కూడా పనికి రాలేదు. ఉపాధ్యాయులు చేత, స్నేహితులు చేత, పోరిగింటివారు చేత ఇలా అందరి చేత తిరస్కరించబడ్డాడు ఆ విద్యార్థి. కాని భవిష్యత్తులో లోకం మొత్తం తన వైపు చూసేటట్లు చేసాడు. అవును అతనే గొప్ప శాస్త్రవేత్త అయిన సర్. ఐసాక్ న్యూటన్. 

ఇలాగే అపోస్తూల కార్యములో సౌలు అనే వ్యక్తి ఆయన నడవడికల వలన తిరస్కరించబడ్డాడు. కారణము యేసును అంగీకరించిన కుటుంబములను చిత్ర హింస పెట్టేవాడు. వాళ్ళను బెదిరించి చంపుటకు సిద్ధపడ్డాడు. ఇలాంటి మోసకరమైన పరిస్థితుల్లో ఉండే వాడు సౌలు. బైబిలో 1కోరింది 1:28 లో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు అని చూస్తున్నాం. సౌలును దేవుడు దర్శించి ఆయన జీవితమును మార్చి పౌలుగా మార్చారు. పౌలు రక్షింపబడిన పిమ్మట క్రీస్తు కొరకు తన జీవితమును ఇచ్చుటకు తెగించి అనేకమైన పత్రికలు రాశారు. అనేక యవ్వన సేవకులను తయారుచేసి అపోస్తూల గ్రంధంలో కేంద్ర బిందువుగా కనబడుతున్నారు. 

దీనిని చదువుతున్న స్నేహితులారా! మనుష్యుల మొకమును చూచి వీళ్ళు ఏమి చేయబోతున్నారు అని హేళనగా ఆలోచించే వారు అనేకులు కలరు. కాని దేవుడు ఘనహీనమైన వారిగా ఎంచబడిన వారిని ఏర్పరచుకొని తన మహిమ కొరకు బలముగా వాడుకొంటున్నారు. సర్ ఐసాక్ న్యూటన్ వలె, అపోస్తూలుడైన పౌలు వలె మీ యొక్క జీవితంలో తిరస్కరించిబడిన భాగమును దేవుడు మార్చి మిమ్మల్ని నిలవబెట్టి దేవుడు వాడుకోగలరు. ఆయన చేతికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఆయన కొరకు ఏదైనా చేయుటకు ముందుకు రండి.
-    శ్రీమతి. జ్యోతి ఆనంద్

ప్రార్థన అంశం:-
చిన్నారుల పర్ట్నర్ షిప్ ప్రణాళికలో కలిసి యున్న పిల్లల యొక్క రక్షణ కొరకు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş