Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.10.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 08-Oct-2022

దిన ధ్యానము(Telugu) 09.10.2022 (Kids Special)

 

అంశం:- భారమును తగ్గించు.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును" - మత్తయి 11:28

 

హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? డైలీ స్కూల్ కు వెళ్తూ, హోమ్ వర్క్ చేస్తూ రోజంతా బిజీగా ఉన్నారా? ఓకె. ఈరోజు మీరు చాలా చక్కగా బ్రైట్ గా మరియు చురుకుగా వున్నారు. సూపర్. మిమ్మును చూసిన వెంటనే నాకు కధ చెప్పాలి అని అనిపిస్తుంది. మీరు కథ వినడానికి రెడీగా ఉన్నారా? సరే.

 

ఒక యజమానుడుకి చాలా మంది పనివారు ఉండేవారు. యజమాని అంటేనే అతను చెప్పిన దానిని వినాలి కదా. తన మాట వినకపోతే పని నుండి తీసేస్తారు లేదంటే శిక్ష విధిస్తారు. అందుకే ఇతను ఏం చెప్పినా ఆ పని మనుష్యులు లోబడతారు అంట. ఒక రోజు ఇద్దరు పనివారిని పిలిచి ఒకరికి బరువైన సంచిని ఇంకొకనికి తేలికైన సంచిని ఇచ్చారు. ఆ సంచులను తీసుకొని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళమని చెప్పారు. ఇంకా మీకు ఇష్టం అయితే సంచిలో ఉన్న వస్తువులను తగ్గించు కోవచ్చు లేదా పెంచుకోవచ్చు అని కూడా చెప్పారు. తేలికైన సంచిని పట్టుకున్న పనిమనిషి సంతోషంగా నేనే మొదట వెళ్తాను అని జాలిగా నడవడం మొదలు పెట్టాడు. కాని బరువైన సంచిని పట్టుకున్న పనిమనిషి త్వరగా నడువలేడు కదా అందుకే ప్రభువా నాకు సహాయం చెయ్యండి అని ప్రార్థిస్తూ నెమ్మదిగా నడవడం మొదలు పెట్టాడు. అతను వెళ్తున్న దారిలో చాలా మంది చిన్న పిల్లలు అడుకుంటున్నారు. అక్కడ కొంచం విశ్రాంతి తీసుకుందాం అని సంచిని క్రిందకు దించాడు. ఆ పిల్లలకు ఏదైనా ఇవ్వడానికి సంచిలో ఏముందో చూద్దాం అని సంచి తెరిచి చూసాడు. అందులో చాలా రకాలైన తినుబండారాలు మరియు అరటి పండ్లు అందులో ఉన్నాయి. ఆడుకుంటూ ఉన్న ఆ చిన్న పిల్లలకు తినడానికి అందులోనుండి ఇచ్చాడు. యజమాని ఇచ్చిన ఈ సంచిలో ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందేమో అని వెతికి చూసాడు. పని చేసి అలసిపోయిన ఉన్న పెద్దవారికి అరటి పండ్లు ఇచ్చాడు. ఇప్పుడు సంచి కొంచం తేలికైనది. నడుచుకొని వెళ్ళవలసిన స్థలానికి వేగంగా నడుచుకొని వెళ్ళిపోయాడు. తేలికైన సంచిని పట్టుకున్న పని వాడు వెళ్తుండగా ఒక కిలో మామిడి పండ్లు కొంటే ఒక కిలో ఉచితం అని వినడంతో సంచి కాళీగా ఉంది కదా అని కొనేసాడు. కొబ్బరికాయ తక్కువ ధరకు అమ్మడంతో దానిని కూడా కొనేసాడు. ఆ బరువును మోయలేక నెమ్మదిగా నడుచుకొంటూ వెళ్ళాడు. ఇంత బరువును మోసుకొంటూ నేను వెళ్ళవలసిన స్థలానికి ఎలా వెళ్ళ గలను అని సనుగుకొంటూ నడవడం ప్రారంభించాడు. ఇతను ఎవరికి సహాయం చెయ్యలేదు తాను ఏ మేలు కలుగుతోందో అనేదాని పైన తన దృష్టిని పెట్టాడు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి స్వార్థం కలిగిన జీవితం లోక ప్రసిద్ధితో నిండిన జీవితం పాపం, చింత ఇటువంటి లోక బరువును మోసుకొంటూ పరలోక రాజ్యమునకు మనం వెళ్లలేము. భారం అంతటిని యేసయ్య యొద్ద దించి వేసి ఇతరులను ప్రేమిస్తూ సహాయం చేస్తూ యేసయ్య పిల్లల వలె జీవించి నట్లయితే పరలోకమునకు వెళ్లగలం. సరేనా. సరే పిల్లలు మనం ఇప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చుకొందమా? 

- సిస్టర్. దేబోరా

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino betoffice casibom matbet matbet giriş