Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.10.2022
Share:

By Village Missionary Movement

Friday, 07-Oct-2022

దిన ధ్యానము(Telugu) 08.10.2022

 

అంశం:- నూరుశాతం విజయం.

 

"కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” - రోమీయులకు 12:21

 

చాలా సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ విప్లవ సమయంలో ఒక టర్కీ సైనికుడు ఒక నర్సును మరియు తన సహోదరుని చాలా దారుణంగా దాడి చేశాడు. తన సహోదరుడు చిత్ర హింసలకు గురవుతూ ఉండగా ఆ నర్సు ప్రాణమును కాపాడుకుంది. అయితే ఆ నర్సు ఒక ఆసుపత్రిలో బలవంతముగా పనిచేయవలసి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టర్కీ సైనికుడు ప్రాణాపాయ స్థితిలో గాయపడి అదే ఆసుపత్రిలో చేర్చబడ్డారు. అతను ఈ నర్సు గమనికలలో ఉంచబడ్డాడు. తన సహోదరుని చంపినవాడు అని తెలుసుకున్నప్పటికి తను క్రైస్తవురాలు కావటంతో ప్రాణముతో పోరాడుతూ నమ్మకమును కోల్పోతున్న అతనిని చక్కగా గమనించింది. కొంచం మేల్కొన్న ఆ సైనికుడు నర్సును గుర్తుపట్టాడు. నన్ను ఇంత ప్రేమగా ఎలా గమనించ గలిగావు అని ఆమెను అడిగాడు. నీ శత్రువును ప్రేమించు అనే యేసును వెంబడిస్తున్నాను అని బదులిచ్చింది. ఈ యేసుని అతను కూడా తెలుసుకొనుటకు ఆతృత గలవాడై యున్నాడు ఆ సైనికుడు. ఆమె చూపిన ప్రేమవలన ఆ ఆత్మ దేవునికొరకు కాపాడబడింది. 

 

దేవునికి ద్రోహులమై ఆయనను విడిచి దూరముగా ఉన్న మనలను ఆయన స్నేహ బంధముతో కట్టి ఆకర్షించుకొని మిక్కిలి అధికముగా మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రేమతో మనలను ఏర్పరచుకొని శాశ్వతమైన సంతోషం, సమాధానం, పాప క్షమాపణ వంటి లోకంలో దొరకని నిధులను మన హృదయంలో ఉంచాడు. 

 

ప్రియమైన వారలారా! మనకు విరోధముగా ఉన్నవారిని క్షమించడం అనేది సవాలుతో కూడిన పని కాని ఇటువంటి కార్యాలలో మనకు విజయం ఇచ్చుటకు దేవుడు ఆశక్తి కలిగి ఉన్నాడు. మన యొక్క మానసిక స్థితినుండి చూసినట్లయితే క్షమించే గుణం మనలో ఒక్క శాతం కూడా కలుగదు. కాని దేవుడు మన పాపములన్నింటిని క్షమించి మనలను ప్రేమించిన విధమును గుర్తుచేసుకొని ధ్యానించినట్లైతే 100 కి 100% విజయం సాధించి ఎవరినైనా క్షమించి, ప్రేమించి ఆత్మల ఆదాయం చేయగలం. ఆమెన్. 

- సహోదరుడు కె. మనోజ్ కుమార్

 

ప్రార్థన అంశం:-

రెండొవ శనివారమైన ఈనాడు మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న విడుదల ఉపవాస కూటము కొరకు మరియు రేపటి దినము తమిళనాడు లో ఉసలం పట్టి అనే సేవా స్థలంలో జరుగుతున్న ఉజ్జీవమును ఆశించేవారి కూటము కొరకు ప్రార్ధిద్దాం. ఈ కూటములో అనేకులు పాలుపొందుకునేలాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet