Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.10.2022
Share:

By Village Missionary Movement

Friday, 07-Oct-2022

దిన ధ్యానము(Telugu) 07.10.2022

 

అంశం:- విడుదల కలగాలి.

 

"దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?" - యెషయా 58:6

 

1963వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జూనియర్ నేతృత్వంలో అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో సమాధానం కొరకు ఊరేగింపు జరిగింది. అందులో నాకు ఒక కల ఉంది అని అంశం పై ఆయన చేసిన ప్రసంగం దేశం నలు మూలల్లో ఉన్న వారిని విడుదల దహమునకు గురి చేసింది. ఇందు నిమిత్తముగా అనేకులకు మరియు ఆయన సంస్థలో. ఉన్న వారికి నిజమైన మార్పు రావడం ప్రారంభమైంది. ఈ ప్రసంగం అమెరికా ప్రజలు తమ్మును హీంసించే వారితో మరియు త్రోసి వేసిన వారితో విడుదల కొరకు పోరాడాలి అని అంతరంగ అనుభూతిని మేల్కొలిపే విధంగా ఉన్నది.

 

ప్రవక్త అయిన యెషయా కాలంలో ప్రజలలో నీతి న్యాయం లేనప్పుడు యెషయా చేసిన ప్రకటనల ద్వారా యెహోవా దేవుడు ప్రజల మనసాక్షిని మేల్కొలిపారు. వారి యొక్క దైవ భక్తి వారితో కూడా ఉన్న ప్రజలను హింసిస్తున్నాం అనే ఆలోచన కూడా లేని స్థితికి తీసుకొని వెళ్ళిపోయింది. దేవుని ప్రజలు పేదవారిని త్రోసివేశారు. దానికి బదులుగా నీతి గల జీవితమును జీవించుటయు దైవభక్తిగల కార్యములను జరిగించుటయు ఉపవాసం ఉన్నటు వంటి వాటిలో శిక్షణ పొందారు. 

 

కాని దయ నొందిన జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రజలతో ప్రేమ, కరుణ చూపుటయే నేను ఏర్పరుచు కున్న ఉపవాసం అని యెహోవా దేవుడు చెప్తున్నారు. ఆకలి గొనిన వారికి ఆహారం ఇచ్చుటయు దిక్కుమాలిన బీదలను చేర్చుకొనుటయు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చుటయే నాకు ఇష్టం అయిన ఉపవాసం అంటున్నారు. అవును మనం చేయగలిగినంత వరకు శ్రమలలో, చిక్కుల్లో ఉన్న వారిని విడిపించుటకు సహాయం చెయ్యాలి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పొందుకున్న రక్షణ సంతోషమును మన వలె దేవున్ని ఎరుగక నరకమునకు వెళ్తున్న ప్రజలకు తెలియజేయాలి. విశ్వసించిన వారి మూలముగా జరిగిన కార్యములు అన్నియు మన మూలముగా కూడా జరగాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై అపవాది చేతుల్లో చిక్కబడి పాపములో పడిన వారిని విడిపించే ప్రభువైన యేసుక్రీస్తు వలె విడుదల వాక్యమును ప్రకటించి నప్పుడు అపవాది చిక్కుల్లో చిక్కబడి ఉన్న అందరిని విడిపించే వారివలె ఉంటాం. హల్లెలుయా!

- సిస్టర్. ఏ. బ్యూలా.

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం పత్రికలను వ్రాసే వ్యక్తులను మరియు వారితో కలిసి పనిచేసే వ్యక్తులందరిని దేవుడు బెసలియేలు జ్ఞానంతో నింపు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet