Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.10.2022
Share:

By Village Missionary Movement

Thursday, 06-Oct-2022

దిన ధ్యానము(Telugu) 06.10.2022

 

అంశం:- అల్పముగా చూడవద్దు.

 

"మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును" - 1సమూయేలు 16:7

 

క్వాటన్ అనే ఇతను ఇంగ్లండ్ కు చెందిన కుర్రాడు. తాను ఇతర పిల్లలు వలె కాక శరీరంలో ఎదుగుదల లేకుండా ఉంటాడు. తనతో పాటు చదువుకొనే వారు లేదా తనకు సమీపంలో ఉన్న వారిలో కొందరు తనను హేళన చేసి మాట్లాడేవారు. ఇతను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆ పాఠశాలలో ఉన్న వారు ఇతని గురించి అల్పముగా మాట్లాడేవారు. వారు మాట్లాడే మాటలు విన్న క్వాటన్ యొక్క హృదయం పగిలిపోయింది. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన క్వాటన్ నేను చచ్చిపోవాలి అని అరుస్తూ ఏడుస్తూ అమ్మతో చెప్పాడు. వాళ్ళ అమ్మకు ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఉన్న క్వాటన్ యొక్క మాటలను వీడియో తీశారు. అదే రోజు తన యొక్క సోషల్ మీడియా పేజీలో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యి లక్షల కొలది మంది ప్రజలు చేరింది. ఆ వీడియో చూసిన తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనను సన్మానించాలి అని అనుకున్నారు. ఆ రోజు జగనున్న ప్రపంచ పోటీ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టుకు ముందు నిలబడే అర్హత కలిగిన ఒకే ఒక్క వ్యక్తి క్వాటన్ అని ప్రకటించారు ఆ ప్రధానోపాధ్యాయుడు. క్వాటన్ ముందు నిలబడి తన వెనుక ఆ ఇంగ్లండ్ జట్టు నిలబడే ఆ దృశ్యం చాలా బాగుండేది.

 

పరిశుద్ధ గ్రంధంలో దావీదు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన చూసినట్లయితే దావీదు అందరి ద్వారా విస్మరించబడి అల్పముగా ఎంచబడ్డాడు. అందరూ ఇతనిని ఇంట్లో మరియు బయట, యుద్ధ స్థలాల్లో అన్నీ స్థలాల్లో చిన్న చూపు చూసారు. కాని దేవుడు అతనిని ఘనపరిచారు. ఆ ఘనత సాధారణమైనది కాదు. అతను ఊహించిన దానికంటే అధికముగా హెచ్చింప బడ్డాడు. ఇశ్రాయేలీయులందరికి రాజుగా అభిషేకించ బడ్డాడు. 

 

ప్రియమైన స్నేహితులారా! మనం ఎవరిని అల్పముగా చూడ కూడదు. ఎందుకు అనగా మనుష్యులమైన మనము ఇతరుల పై రూపమును మాత్రమే చూస్తాం. కాని యెహోవా దేవుడు హృదయమును చూస్తాడు. ఆయన హెచ్చుగా ఉన్న వారిని తగ్గించగలరు అలానే తక్కుగా ఉన్న వారిని హెచ్చించ గలరు. కాబట్టి ఎవరిని అల్పముగా చూడకుండా దేవుని స్వరూపంతో సృష్టించబడిన వారు అని ప్రతి ఒక్కరినీ ఘనపరచాలి. అప్పుడు దేవుని చిత్తం ఈ భూమిలో నెరవేరుతుంది అనే దానిలో సందేహమే లేదు. ఆమెన్.

- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం అనే పత్రికను సోషల్ మీడియా ద్వారా చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉజ్జీవపు జ్ఞానం ఏర్పడు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al