Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.10.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 04-Oct-2022

దిన ధ్యానము(Telugu) 04.10.2022

 

అంశం:- మన పోరాటం ఎవరితో?

 

"ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము" - ఎఫెసీయులకు 6:12

 

 ప్రస్తుత కాలంలో వార్త పత్రికలలో సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్న వింటున్న వార్తలు అల్లరి, హింస, పోరాటం, అన్యాయం అనేటటువంటివే. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ఒక సమూహం లేచి పోరాడుతుంది. క్రీస్తుని ఎరిగి ఆయన బిడ్డలమైన మనకు కూడ ఆత్మీయ పోరాటములు కలవు. అయితే మనం యుద్ధ భూమిలో తోటి మనుష్యులతో కలుసుకొన వలెన వారితో కాదు. మనకు విరోధముగా పోరాడుతున్న ఆకాశ మండలముందున్న దురాత్మ సమూహములతోను ప్రస్తుత అంధకార సబంధులగు లోక నాధులతోను మనం పోరాడాలి. ఈ దురాత్మలకు విరోధమైన పోరాటాలు మనం ఎలా ఎదుర్కొవాలి? దాని కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పరచి యున్నాడు. దీనిని ఎఫెస్సీ 6:11 లో మనం చూడవచ్చు. అపవాది యొక్క తంత్రములను ఎదురించాలి దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును ధరించు కోవాలి. సైనిక వాదం లేదా దేవుని కవచం ఏదనగా సత్యం అనే కవచం. నీతి అనే మార్గ దర్శకం, సమాధాన సువార్త యొక్క సిద్దపాటు అనే పాద రక్షలు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రణము,వాక్యం అనే ఆత్మీయ ఖడ్గం వంటివి. ఈ ఆయుధములు ధరించుకొని మనం ఆత్మీయ వరములను పొందుకొని విజయం పొందుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు

 

అందుకొరకే మనలను పిలుచుకున్నాడు. అనేక రకములైన ఆత్మలతో మనకు పోరాటం కలదు. యేసుక్రీస్తు వాక్యం ద్వారా సాతానును జయించిన విధముగా మనం కూడా వాక్యం అనే ఆత్మీయ ఖడ్గం చేతిలో పట్టుకొని సాతాను పరిగెత్తేలా వాడిని తరిమికొట్టాలి. ఫోతీఫరు భార్యకు పట్టుకున్న వ్యభిచారపు ఆత్మ యోసేపును కూడా పట్టుకోవాలి అని పోరాడినప్పుడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్ కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని చెప్పి ఆ ఆత్మీయ పోరాటంలో విజయం సాధించి పారిపోయాడు కదా! ధనాపేక్ష అయిన ఆత్మ ప్రేరేపించడం వలన అననియా సప్పిరా వీరిద్దరూ అబద్దం చెప్పి ఆత్మీయ పోరాటంలో అపజయాన్ని పొంది మరణించారు కదా. ఇవన్నీ మనలను హెచ్చరిస్తున్నాయి. మన యొక్క పోరాటం ఎటువంటి ఆత్మలతో ఉన్నది అనేది అన్వేషించి యుద్దానికి సిద్ద పడదాం. పోరాటంలో విజయం సాదించి పరలోక భాగ్యం పొందుకుందాం. హల్లెలూయా!

- శ్రీమతి. భువనా ధనబలన్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు ఉదయం 5గంటలకు యూట్యూబ్ లో మనం తమిళ భాషలో ప్రసారం చేస్తున్న నిబంధన ఆరాధన మూలముగా అనేకులు ఆశీర్వదించబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş