Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.10.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 02-Oct-2022

దిన ధ్యానము(Telugu) 02.10.2022 (Kids Special)

 

అంశం:- అంతా మంచికే.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28

 

హాలో పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకే పిల్లలు మీరందరూ వ్యవసాయ పనిని, సిమెంట్ పనిని, పెయింట్ వేసే పనిని మరియు కూలి పనిని చేసే చాలా మందిని చూసి ఉంటారు కదా! కాని కర్రలు కొట్టే వారి గురించి ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకుందాం. 

 

దినేష్ మరియు గోపి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ ఈ కట్టెలు కొట్టే పనిని చేస్తూ వారి కుటుంబాన్ని పోషించే వారు. ఆ ఇద్దరికి యేసయ్య గురించి బాగా తెలుసు. దినేష్ అన్నయ్య యేసయ్య చేసిన చిన్న చిన్న వాటి కొరకు కూడా థాంక్స్ చెప్పేవాడు. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చెయ్యకుండా ఏ పనిని కూడా చెయ్యడు. కాని గోపి అన్నయ్య మాత్రం యేసయ్య తనకు ఎన్ని మేలులు చేసిన లోటులను చెప్తూ సనుగుకొంటూ ఉంటాడు. ఉదయము అడవికి వెళ్లిన వాళ్లిద్దరూ ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుంది. ఒకరోజు ఉదయం ఎప్పటి లాగానే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లారు. అక్కడ వారికి ఒక ఆశ్చర్యం కనిపించింది. అదేమనగా అడవి అంతా నిప్పు అంటుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే గోపి అన్నయ్య ఈ దేవుడు ఎప్పుడు మనలను నెమ్మదిగా వుండనియ్యడు. ఈ అడవిని, ఈ కట్టెలను నమ్మితే మన కుటుంబం వీధిన. పడాల్సిందే అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. దినేష్ అన్నయ్య మాత్రం చాలా బాధతో ఇంటికి వెళ్లి మోకాళ్ళు వేసి యేసయ్య నీవు నా జీవితంలో ఏం చేసినా నా మంచికే చేస్తావు. ఇప్పడు అడవిలో ఉన్న చెట్లు అన్నీ నిప్పు అంటుకొని కాలిపోయాయి మరి నేను ఏం చెయ్యాలి అని అడిగి ప్రార్థిస్తున్నాడు. వెంటనే ప్రభువు తన హృదయంతో మాట్లాడారు. నీవు వెళ్ళి అడవి కాలిపోయిన తరువాత క్రింద పడిఉన్న కర్రలను తెచ్చి వ్యాపారం చెయ్యు అన్నారు. దినేష్ అన్నయ్య సంతోషంగా ప్రభువు తనతో చెప్పిన విధముగా చేశాడు. కట్టెలు కంటే ఆ కాలిపోయిన కర్రలే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి. ప్రభువు దినేష్ అన్నయ్యను ఆశీర్వదించడం మొదలు పెట్టారు. తన కొరకు సొంత దుకాణం కూడా ప్రారంభించి దానికి యజమాని అయ్యాడు. తన జీవితమే మారిపోయింది. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి దినేష్ అన్నయ్య కూడా తొందర పడి నిర్ణయం తీసుకొని ఉంటే ఈ గోపి అన్నయ్య జీవితం వలె అర్థం లేకుండా పోయేది. కష్టపడి కట్టెలు కొట్టుకొని బ్రతికే అన్నయ్యకు కష్ట పడకుండా క్రింద పడిన ఉన్న కర్రలు యేసయ్య ఇచ్చారు చూసారా? యేసయ్య ఎల్లప్పుడూ మనకు మంచే చేస్తారు. మనం తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని యేసయ్య ఇచ్చే ఆశీర్వదములను కోల్పోకూడదు. సరే పిల్లలు ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చుకొందమా! 

- శ్రీమతి. సరళ శుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş