By Village Missionary Movement
Thursday, 29-Sep-2022దిన ధ్యానము(Telugu) 30.09.2022
అంశం:- బలవంతము.
"పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు" - మత్తయి 11:12
మన దేశం బానిసగా ఉన్నప్పుడు మన స్వాతంత్ర్య పోరాట యోధులైన గాంధీజీ, నెహ్రు, రాజాజి వంటి వారు నిరసనలు, నిరాహార దీక్షలు అనే పద్ధతులను ప్రయోగించి బలవంతము చేసి స్వాతంత్ర్యం సంపాదించారు. ప్రభువైన యేసుక్రీస్తు యెరికో పట్టణమునకు వచ్చు చున్నాడు అని విని తిమయి కుమారుడైన బర్తిమయి అనే గ్రుడ్డి బిక్షకుడు దావీదు కుమారుడా యేసు నన్ను కారుణింపమని కేకలు వేసినప్పుడు శిష్యులు అతనిని గద్దించారు. ఆ బిక్షకుడు మాత్రం దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేసి బలవంతం చేసి చూపును పొందుకొన్నాడు.
థామస్ అల్వా ఆడిషన్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. విద్యుత్ ను కనుగొనుటకు 999 సార్లు ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. కాని 1000 వ సారి ప్రయత్నం చేసి విద్యుత్ కనుగొని విజయం సాదించాడు. అతడు ఒక ప్రార్థనాపరుడు అని గుర్తించ బడినది. ఒక విధవరాలు తనకు నాయ్యం తీర్చమని పట్టణపు న్యాయాధిపతిని మాటిమాటికి విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆమె మాటిమాటికి వచ్చి గోజాడ కుండునట్లు ఆమెకు న్యాయం తీర్చుదును అని చెప్పిన న్యాయాధిపతి న్యాయం తీర్చాడు. ఆ విధవరాలు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చేలా చేసింది. ఇలా అయితే నీతిగల న్యాయాధిపతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు మన విన్నపములు వినకుండా ఎలా ఉంటాడు. ఈలోకంలో మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదము. విశ్వాసముతో దేవునికి ఇష్టులై నడుచుకొని పరలోక రాజ్యం బలవంతంగా పట్టుకుందాం. బలవంతం చేయడం అనే ఈ మాటకు చాలా రకాల ఉదాహరణలు పరిశుద్ధ గ్రంధంలో కలవు. దీనిని చదువుతున్న మనం అనేక విషయాల్లో బలవంతం చేస్తూ ఉంటాం. ఇందులో అధికముగా లోక ప్రాకారములైన కార్యాలే. లేదా లోకపు వ్యక్తులు చేసే బలవంతములే. కాని పరిశుద్ధ గ్రంధంలో ఒక విషయంలో బలవంతం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నారు. అది పరలోక రాజ్యం కొరకు. కాబట్టి బలవంతం చేసి పరలోకరాజ్యమును పొందుకుందాం.
- శ్రీమతి. జాస్మిన్ పాల్.
ప్రార్థన అంశం:-
యవ్వనస్తుల కొరకు టి.వీ లో ప్రసారం చేయబడుతున్న కార్యక్రమాల ద్వారా యవ్వనస్తుల మధ్యలో ఉజ్జీవం కలుగులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250