Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.09.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Sep-2022

దిన ధ్యానము(Telugu) 29.09.2022

 

అంశం:- చింతించకండి.

 

"దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి" - ఫిలిప్పీయులకు 4:6

 

వేకువజామున నేను మా తోటలో కూర్చొని ఉన్నప్పుడు హఠాత్తుగా కిచ్ కిచ్ అనే శబ్దం వచ్చింది. దగ్గరకు వెళ్లి చూసి నప్పుడు చెట్టుపైన ఉన్న పిచ్చుక గూటిలో పిచ్చుక పిల్లలు అని తెలుసుకున్నాను. కొంచం సేపు కూర్చొని వాటి వైపు చూస్తూ ఉన్నపుడు ఒక అందమైన దృశ్యం నేను చూసాను. కన్నులు తెరవలేని ఆ పిచ్చుక పిల్లలు తమ తల్లి వచ్చి అక్కడ ఉన్న చెట్టు పైన కూర్చున్న శబ్దం విని మౌనముగా నోరు తెరిచాయి. తల్లి పక్షి ఆహారం పెట్టగానే అలా తినేసాయి. 

 

ఇందులో మనకు ఒక పాఠం ఉంది. ఆ పిల్లలు తమ తల్లి తమ దగ్గర వాలిన వెంటనే ఆహారం కొరకు తమ నోర్లను తెరిచాయి. తల్లి పక్షి మనకు అవసరమైన ఆహారం ఇస్తుంది అని నమ్మి దానిని తింటాయి. కాని మనుష్యుల మైన మనం మాత్రం దేవుడు మనతో ఉన్నప్పటికీ ఆయన మన అవసరతలు సందిస్తున్నప్పటికి చాలా సార్లు రేపటి దినమున గూర్చి ఆలోచించి, భవిష్యత్తును గూర్చి ఆలోచించి చింతిస్తూ సనుగుకొంటు ఉంటున్నాం. ఇలా చింతించే వారిని చూస్తే ప్రభువు ఈ విధముగా చెబుతున్నారు. పక్షులను గమనించి చూడుడి అని అవి చీమలు వలె ఆహారమును కూర్చు కొనక పోయినను ప్రభువైన యేసుక్రీస్తు వాటిని ప్రతి రోజు పోషిస్తున్నారు. కాని మనం మాత్రం దీనికంటే అది దొరికితే బాగుండు ఇప్పుడు ఇది అవసరం లేదు అని దేవుడు ఇచ్చిన దానిని విస్మరిస్తున్నాం. ఇందువలన దేవుడు బాధ పడతాడు. ఆయన మన పరమతండ్రి మన అవసరతలు, మన హృదయ వాంఛలు అన్నింటిని ఎరిగియున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన అన్నింటిని ఇచ్చుటకు ఆయన సర్వ శక్తిమంతుడై యున్నాడు. ఇచ్చిన వాటిని సంతోషంగా అంగీకరించి దేవుని సహాయంతో జీవించినప్పుడు మనం సంతోషంగా ఉండవచ్చు. మనం చింతించినప్పుడు సంతోషమును మరియు సమాధానమును కోల్పోతాం. 

 

ప్రియమైన వారలారా! చాలా సమయాల్లో మనం దేవుడు ఇచ్చిన ఆశీర్వదములు మరచి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట విడిచి సనుగుకొంటూ ఆయన మనకోరకు ఉంచిన ఆశీర్వదములు కోల్పోతున్నాము. మన దేవుడు పరిస్థితులు కంటే ఉన్నతమైన వాడు. ఆయన మనలను సృజించిన దేవుడు. ఆయన మన ఆలోచనలను ఎరిగిన వాడు. కాబట్టి ఆయన దయచేయు క్రియలలో సందేహ పడకుండా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి దేవా నీకు స్తోత్రం అని చెప్పినప్పుడు ఆయన సంతోషంగా మన కొరకు ఆయన క్రియలను జరిగిస్తారు. ఆమెన్.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం:-

దేశం కొరకు భారంతో ప్రార్ధించే నూతన ప్రార్థన కూటములను దేవుడు లేపి ఇచ్చులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş