Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.09.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Sep-2022

దిన ధ్యానము(Telugu) 28.09.2022

 

అంశం:- యెరూషలేమా పిలుపును వినుము.

 

"మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు" - కీర్తనలు 91:1

 

జాన్ బనియన్ వ్రాసిన మోక్ష ప్రయాణం అనే పుస్తకంలో కధా నాయకుడు క్రిస్టియన్ ను మరియు తన పిల్లలను ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ జరుగుతున్న దానిని గమనించమని చెప్పాడు. అక్కడ ఒక కోడి తన పిల్లలతో కలిసి ఆహారం తినుటను చూస్తారు. అందులో ఒక కోడి పిల్ల నీటిని త్రాగడానికి నీళ్లు ఉన్న గిన్నె యొద్దకు వెళ్లి నీళ్లను త్రాగిన ప్రతీసారి తల ఎత్తి ఆకాశం వైపు చూస్తూ ఉంది. అప్పడు ఆ కధా నాయకుడు ఈ కోడి పిల్లను చూసారా? అది త్రాగుతున్న నీటి కొరకు కన్నులు పైకి ఎత్తి పరమ తండ్రికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తుంది గమనించారా అని చెప్తాడు. అందరూ ఆశ్చర్యపడి యెహోవా దేవుడు సృజించిన సకల సృష్టి ఆయనను స్తుతించుట చూసి వారు కూడా దేవున్ని స్తుతిస్తారు. పైగా వారు కోడి నుండి నాలుగు రకాల పిలుపు శబ్దాలు కనుగొంటారు. అందులో ఒకటి తక్కువ వెలుతురు ఉన్న సమయంలో మరియు మార్గం కనిపించని ప్రదేశాల్లో తన పిల్లలకు ఇవ్వబడిన సాధారణ పిలుపు. రెండు ఆహారం ఉన్న స్థలాన్ని చూపించడానికి లేదా ఆ ఆహారమును ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన పిలుపు. మూడు శత్రువు సమీపించినప్పుడు లేదా ఆపద సమీపించి నప్పుడు హెచ్చరిక పిలుపు. చివరిగా తన రెక్కల క్రింద పిల్లలను కౌగలించుకొనుటకు పిలిచే మృదువైన ప్రేమ గల పిలుపు. ఈ. నాలుగు పిలుపులకు కథానాయకుడు అర్దాన్ని వివరించాడు. ప్రభువు చీకటిలో ప్రజలతో భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును అని యెషయా 41:10లో చెప్పి దేవుని ప్రసన్నతను మనకు అనుగ్రహిస్తున్నాడు. జీవిత ఆధారం మొదలుకొని పరలోక ఆశీర్వదం కొరకు వెతుకుతున్న వారితో అడుగుడి మీకు ఇయ్య బడును అని మత్తయి 7:7లో చెబుతున్నాడు. సునామీ వలె శత్రువు వచ్చినప్పుడు అపవాదిని ఎదురురించుడి అని యాకోబు 4:7లో హెచ్చరిస్తూ సహాయాన్ని అందిస్తూ ఆశ్రయాన్ని ఇస్తున్నారు. ఆయన రెక్కల క్రింద నీకు అశ్రయం కలుగును అని కీర్తనలు 91:4 లో చెప్పి మనలను హత్తుకొంటున్నాడు. 

 

అవును ప్రియమైన వారలారా! కోడి తన పిల్లను చేర్చుకున్న విధముగా ఎన్నో సార్లు మనలను చేర్చు కొనుటకు పరమ తండ్రి మనలను పిలుస్తున్నారు కాబట్టి పిలుపును నిర్లక్ష్యం చెయ్యకుండా సాకులు చెప్పకుండా తొందరగా పరిగెత్తుకొని వచ్చి మనలను కాపాడే రెక్కల క్రింద సంరక్షణ పొందుకుందాం. హల్లేలూయా!

- శ్రీమతి. బ్యూలా సెల్వరాజ్ గారు

 

ప్రార్థన అంశం:

ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించే మూలముగా అనేకులు పోషింప బడేలా వారందరు ప్రభువును తెలుసుకొనేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al