By Village Missionary Movement
Monday, 26-Sep-2022దిన ధ్యానము(Telugu) 27.09.2022
అంశం:- చేదు వేరు.
"ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును" - యాకోబు 3:16
ఉక్రేన్ మరియు రష్యాకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణము కోల్పోయిన ఒక ఉక్రేన్ యొక్క వీరుని యొక్క అంత్యక్రియల యొక్క ఆరాధనలో రెండు దేశాల యొక్క సంఘపు బోధకులు చేతులు కలిపి ఐజ్య పరిచిన ఒక సంఘటన అనేకులకు వేదన కలిగించింది. థామస్ పిల్ అనే స్థలములో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓలెక్స్ అండర్ జెనివ్ అనే ఉక్రేన్ సైన్య వీరుని యొక్క అంత్యక్రియల ఆరాధన జరిగింది. అక్కడ మాట్లాడిన ఉక్రేన్ బోధకుడు మనం అందరం రష్యా ప్రజలను, సంఘాలను విస్మరించాలి అని మాట్లాడారు. ఈ కూటములు కూర్చొని ఉన్న ఒక రష్యా బోధకుడు ఇలా మాట్లాడ కూడదు అని దండించారు. కాసేపట్లో అక్కడ ఉన్న సిలువను ఎత్తి ఉక్రేన్ బోధకుడ్ని కొట్టడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో అక్కడ ఉన్న సైన్య వీరులు వెళ్ళి ఆ ఇద్దరి బోధకులను సమాధాన పరిచారు. సమాధానం గూర్చి బోధించ వలసిన బోధకులే గొడవ పడటం మిక్కిలి వేదనకు గురి చేసింది. యాకోబు 3:14-18 వచనాల్లో చేదు మత్సరం గూర్చి యాకోబు రాసాడు. తోటి వ్యక్తుల పట్ల ద్వేషం ఇది చేదుతో నిండినదై హృదయంలో దాగి ఉంటుంది. సమయం వచ్చిప్పుడల్ల ఆ చేదు మన క్రియలలో బయలు పడుతుంది. ఇదే అల్లరికి మరియు సకల నీచ కార్యములకు వేరు అని పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాశాడు.
కొంత మందిపైన కలిగి ఉన్న చేదు మనకు పెద్ద పాపం వలె అనిపించదు. అదే సమయాల్లో ఈ చేదు అనేకుల హృదయాల్లో మానసిక రుగ్మతలకు, కొన్ని సమయాల్లో శరీర రుగ్మతలకు కారణం అవుతుంది. అధికముగా ఈ చేదు అనే స్వభావం హంతకుడు అనే స్థితికి మనుష్యులను దిగజారుస్తుంది. దావీదు పైన కలిగి ఉన్న చేదు సౌలు జీవితంను నాశనము చేసింది. అమ్నోను పైన కలిగిన ద్వేషం అబ్షాలోము జీవితమును నాశనం చేసింది. మీకు ఎవరి మీదనైనా చేదైన ద్వేషం ఉన్నట్లు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. చేదు వేరు ఎక్కడ ఉందో మీరు ఆలోచించినట్లయితే అది ఒక వ్యక్తిని క్షమించ లేని విషయం లొనే మొదలు అవుటను మనం గ్రహించవచ్చు. కాబట్టి వారిని మనసారా క్షమించే హృదయమును దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్దిద్దాం. దేవుని ముందు మిమ్మును తగ్గించుకొని ప్రార్దించి చేదుతో నిండిన స్థలం నుండి పరిశుద్ధ గ్రంధం సెలవిచ్చిన దివ్యమైన స్వభావమునకు చేరులాగున మనం ప్రయాసపడదాం. ప్రభువు మనలను నడిపించును గాక! ఆమెన్.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.
ప్రార్థన అంశం:-
ఉత్తర రాష్ట్రలలో మన పరిచర్య సరిహద్దులు దేవుని నామ మహిమకు విస్తరించబడుటకు నూతన సేవ స్థలాలు ప్రారంభించ బడుటకు దేవుడు ద్వారం తెరుచులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250