By Village Missionary Movement
Thursday, 22-Sep-2022దిన ధ్యానము(Telugu) 22.09.2022
అంశం:- బలహీనతలు ఎందుకు.
"దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను" - ఎఫెసీయులకు 1:12
లిథుయేనియ అనే దేశంలో క్రైస్తవులు తీవ్రముగా పర్యవేక్షించబడుచు, హింసించబడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వృద్ధ తల్లి పక్షవాతంతో బాధింప బడుతున్నారు. ఆమె వ్యాధి గ్రస్తురాలు కావడంతో కాపలా దారులచే పర్యవేక్షించ బడలేదు. ఆ వ్యాధి వలన కాళ్ళు మెలి తిరిగాయి. శరీర భాగాలు ముడుచుకొని ఉండేవి. తల క్రిందకు వేలాడుతూ ఉండేది. కళ్లు, కుడి చేయి యొక్క చూపుడు వేలు మాత్రమే ఆమె నియంత్రణలో ఉన్నాయి. ఉదయం అల్పాహారం పూర్తి అయిన తరువాత ఆమె సోఫా నుండి క్రింద పడిపోకుండా తన చుట్టూ దిండులను పెట్టి బల్లపై టైప్ రైటర్ ఉంచి ఒకే ఒక వేలు సహాయంతో రాత్రి అంతా ఆ తల్లి గారు టైప్ చేసింది ఎంటో తెలుసా? రష్యా భాషలో, లాటిన్ భాషలో, ప్రాంతీయ భాషలో పరిశుద్ధ గ్రంథమును మరియు బిల్లి గ్రాహం వంటి వారు వ్రాసిన పుస్తకాలను అనువాదించి వాటిని టైప్ చేసి ప్రార్ధించే వారు ఆ తల్లిగారు.
పరిశుద్ధ గ్రంధంలో కూడా పౌలు తాను బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని కొరకు సువార్తను ప్రకటించాడు. నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడెను అని పౌలు చెప్పుట మనం పరిశుద్ధ గ్రంధంలో చదువుతున్నాం. అవును బలహీనతలు, సమస్యలు, బాధలు అతనిని ఏ ఒక్కరోజు దేవుని సేవ చెయ్యకుండా ఆటంక పరచలేదు. ఇవన్నీ నా కొరకు ఏర్పరిచినవి అని పౌలు గ్రహించడం వలన ఈలోకపు కార్యాలు ఎదుర్కొని క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేసాడు.
అవును ప్రియమైన వారలారా! ప్రభువును వెతికినప్పటికి నా కెందుకు ఈ బలహీనతలు, నేనేందుకు ఈ లోటుతో పుట్టాను అని అంగలార్చవద్దు. కృంగిపోవద్దు. మనలను సృజించిన వాడు ఆ తల్లిని ఆయన నామ మహిమర్థమై సృజించాడు కదా మరి మిమ్మల్ని కూడా నిశ్చయముగా ఆయన తన నామ మహిమర్థమై వాడుకొంటాడు. బలహీనతలలో ఆయనను స్తుతించండి. ప్రభువు యొద్దనుండి అద్బుతముల కొరకు ఎదురు చూడండి. నిశ్చయముగా ప్రభువు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలుయా!
- శ్రీమతి. మంజులా గారు
ప్రార్థన అంశం:-
ఫీల్డ్ లో మనం సందిస్తున్న చిన్న పిల్లలు, యవ్వనులు దేవునిలో సదా కాలము నిలుచులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250