Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.09.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 21-Sep-2022

దిన ధ్యానము(Telugu) 21.09.2022

 

అంశం:- పరిపూర్ణ మైన ఆశీర్వాదం.

 

"నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు" - సామెతలు 28:20

 

జాస్మిత అనే అక్కకు ఒక కుమారుడు ఉన్నాడు. సరైన సమయంలో తన బాధ్యతను పూర్తి చేయులాగున తన కుమారుడికి రూల్స్ పెడుతూనే ఉంటారు ఆ అక్క. స్నానము చేసిన వెంటనే టవల్ చక్కగా అరబెట్టావా? కుళాయి బాగా క్లోజ్ చేసావా? బాత్ రూమ్ లో లైట్ ఆఫ్ చేసావా అని అడుగుతూ ఉంటారు. స్కూల్ నుంచి రాగానే బైబిల్ రీడింగ్ కు ఇచ్చిన అధ్యాయాలు పూర్తి చేసావా? 9 గంటల లోపు హోమ్ వర్క్ చేసేసావా? అని అడుగుతూ యుక్త వయస్సులో కూడా ఇదే క్రమశిక్షణ పాటించాలి అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడల్లా ఆ యవ్వనుడికి చాలా కోపం వచ్చేది. తాను డిగ్రీ పూర్తి చేసి జాబ్ కొరకు ఇంటర్వ్యూకు వెళ్ళాడు. మేడపైన ఉన్న గదిలో ఇంటర్వ్యూ జరగ బోతుంది. ముందు ఉన్న గదిలోకి వెళ్ళగానే చిన్నా భిన్నంగా పడి ఉన్న కుర్చీలను చక్కగా సర్ది పెట్టాడు. మెట్లు ఎక్కుతున్నప్పుడు అక్కడ వెలుగుతున్న లైట్ ను ఆఫ్ చేసాడు. అక్కడ ఉన్న వాష్ బేసిన్ లో వాటర్ లీక్ అవ్వడం చూసి దానిని ఆఫ్ చేసాడు. తన తల్లి తనకు నేర్పించిన అన్నింటిని తనంతట తానే చేసేసాడు. అయితే తాను 100 మంది తరువాత 101వ వ్యక్తిగా కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఒకతను వచ్చి ఆ యవ్వనుడికి లోపలికి రమ్మని చెప్పాడు. మిగతా 100 మంది తన వైపు ఆశ్చర్యంగా చూసారు. ఆ యవ్వనుడు చేసిన ప్రతి పనిని సీసీ టి.వి ద్వారా గమనించిన ఏం.డి వారు టైప్ చేసి ఉంచిన అపాయింట్మెంట్ అడర్స్ అతనికి ఇచ్చారు. 

 

మనము కూడా ఇటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. ఇంకా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మనుష్యుల ముందు ఉన్నాం అనుకొనకుండా దేవుని ముందు వీటన్నింటినీ చేస్తున్నాం అని ప్రతి కార్యమును నిజాయితీగా చేస్తే నిశ్చయముగా ఆశీర్వదములు పరిపూర్ణంగా పొందుకుంటాం. 

 

పైన చెప్పబడిన సంఘటనలో నా కుమారుడికి రూల్స్ యవ్వన కాలంలో కోపం తెప్పించినప్పటికి అదే తనకు గొప్ప ఆశీర్వదాం కలుగజేశాయి. అదేవిధంగా పరిశుద్ధ గ్రంధం చెప్పే నియమాలు మనకు చేదుగా ఉన్నప్పటికీ అవి మనలను సరైన దారిలో నడిపించుటకు దేవుడు మనలను ఆశీర్వదించుటకు అని గ్రహించి వాటిని వెంబడిద్దాం. దేవుని ఆశీర్వదములను పొందుకుందాం. ఆమెన్.

- శ్రీమతి. జాస్మిన్ పాల్.

 

ప్రార్థన అంశం:-

గృహ కూడికలు అభివృద్ది చెయ్యాలి అనే నిర్ణయం ద్వారా అనేక గృహ కూడికలు అభివృద్ధి చెందేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet