By Village Missionary Movement
Monday, 19-Sep-2022దిన ధ్యానము(Telugu) 20.09.2022
అంశం:- త్రోసివేయుట.
"ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను" - కీర్తనలు 118:22
ఒక భవనమునకు కట్టినప్పుడు. ప్రాముఖ్యంగా కలపతో నిచ్చెన వలె చేసి దానిపైన ఎక్కి నిలబడి భవనాన్ని కట్టి దానికి రంగులు వేసి పని పూర్తి అయిన తరువాత ఆ కర్రలను ఒక్కొక్కటిగా తీసివేసేస్తారు. ఇల్లు పూర్తిగా కట్టిన తరువాత గృహ ప్రవేశం చేస్తున్నప్పడు ఆ కర్రలను ఎవరికి కనిపించ కుండా ఇంటి వెనుక పెట్టేస్తారు. ఎక్కడో పెరిగే అరటి చెట్టును ఇంటి ముందు నాటి గృహ ప్రవేశమునకు అందరిని ఆహ్వానిస్తారు. కీర్తి అంత ఆ అరటి చెట్టుకే సొంతం అవుతుంది. దీనిలో గల సత్యం ఏమిటి ఆ అరటి చెట్టు మూడురోజుల్లో ఉంటుంది. ఆ తరువాత మేకలు, ఆవులు దానిని తినేస్తాయి లేదా చిన్న పిల్లలు దాని ఆకులను చింపి వేస్తారు. ఎక్కడో ఒక మూల దాచి పెట్టి ఉంచిన ఆ కలప కర్రలు మరొక భవనం నిర్మించడానికి నిచ్చెన వలె చేసేస్తారు.
పరిశుద్ధ గ్రంధంలో 1సమూయేలు 17వ అధ్యాయం దావీదుకు మరియు గోలియాతుకు యుద్ధం జరగడం మనం చూస్తున్నాం. అందులో గోలియాతు దావీదుతో యుద్ధం చేయుటకు తల మీద రాగి శిరస్త్రాణము, యుద్ధ కవచము, కాళ్లకు రాగి కవచమును మరియు భుజముల మధ్య రాగి బల్లెము వంటి వాటిని ధరించుకొని ఉంటాడు. కాని ఈ దావీదు మాత్రం అందరి దృష్టిలో మిక్కిలి స్వల్పంగా కనబడే 5 గులక రాళ్ళను తీసుకొని యుద్దానికి వెళ్తాడు. ఆయుధాలు పట్టుకొని ఉన్న గోలియాతు నున్నని గులక రాళ్ళను పట్టుకొని ఉన్న దావీదు ముందు ఓడిపోతాడు. దావీదు ఒక్క గులక రాయితో దావీదును పడద్రోస్తాడు. రాయి వాడి నుదుట చొచ్చినందున వాడు నేలన బోర్లపడెను అని పరిశుద్ధ గ్రంధంలో వ్రాయబడి ఉంది.
దీనిని వింటున్న దేవుని పిల్లలారా! మీరు కలప చెట్టువలె లేదా నున్నని రాళ్ళ వలె ఇతరుల ద్వారా త్రోసి వేయబడి ఉండవచ్చు. లేదా మనుష్యులు మీ యొద్ద నుండి సహాయము పొందుకొని మిమ్మును అవసరానికి వాడుకొని ఉండవచ్చు. కృంగిపోవద్దు ఒక వేళ మీరు ఉన్న పరిస్థితిని చూసి అనేకులు మిమ్మును అల్పముగా చూడ వచ్చు. ఎందుకు అనగా యేసు కూడా మనుష్యుల ద్వారా త్రోసివేయబడిన వాని వలె అల్పముగా ఎంచబడి ఉండేవారు. ఈనాడు ఉన్న పరిస్థితులు, సమస్యలు ఏదియు నిరంతరంకాదు. నిశ్చయముగా మన దేవుని ద్వారా సమస్తము ఒక రోజు మారతాయి. విశ్వాసము కలిగి ఉండండి దేవుడు పరిస్థితులను మార్చి మిమ్ములను హెచ్చిస్తారు. ఆమెన్.
- శ్రీమతి. శక్తి శంకర్రాజ్
ప్రార్ధనా అంశం:-
యెహోషువా లెమ్ము అనే కార్యక్రమం ప్రతి ఆదివారం తమిళ్లో యవ్వన బాలురకొరకు బయలుపరచబడు చున్నది. దీని మూలముగా అనేకమంది యవ్వనులు తాకబడులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250