Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.09.2022
Share:

By Village Missionary Movement

Friday, 16-Sep-2022

దిన ధ్యానము(Telugu) 17.09.2022

 

అంశం:- కన్నీటి బుడ్డి.

 

"దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును" - ప్రకటన గ్రంథం 7:17

 

పూర్వ కాలంలో పార్సియా అనే దేశంలో ఒక వింత ఆచారం ఉండేది. దుఃఖ కరమైన సమావేశాలు ఉన్న ప్రదేశాల్లో అక్కడ ఉన్న యాజకులు ఏడుస్తున్న వారి కన్నీటిని దూది సహాయంతో సేకరించి దానిని పిండి బుడ్డిలో వాటిని సేకరించి బుడ్డిలో వాటిని చాలా భద్రంగా ఉంచేవారు. మరణపు అంచున ఉన్న వారికి ఈ కన్నీటిని ఉపయోగిస్తే వారు పునర్ జన్మను పొందుకొంటారు అనేదే వారి నమ్మకం. తమ ఆత్మీయులలో ఎవరైనా మరణించి తరువాత కన్నీటి బుడ్డిలో గల కన్నీటిని పోసి ఆ బుడ్డితో సహా ఆ శవం పైన పెట్టి పాతి పెడతారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో కాన్నీటితో దేవున్ని వెతికే ఏ ఒక్కరిని కూడా ఆయన చేయి విడువ లేదు. తన పిల్ల వాడి కొరకు ఏడ్చిన హాగరు (అదికాండం 21:16). తన కుమారుని కొరకు ఏడ్చిన నాయిను అనే ఊరి విధవరాలు (లూకా 7:12-13). రాజైన హిజ్కియా (యేషయా 38:3). తన కన్నులను ఆకాశము వైపు ఎత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని కన్నీరు కార్చిన సుంకరి (లూకా 18:13). వీరందరూ ప్రభువు నుండి అద్బుతములను పొందుకున్నారు. ఇందువలననే నా కన్నీళ్లను నీ బుడ్డిలో ఉంచబడి యున్నవి అని అన్నాడు. 

 

ప్రియమైన వారలారా! జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వలన, అపజయాల వలన, వ్యాధుల వలన, భారాల వలన, మోసాల వలన, కష్టాల వలన కృంగిపోయి ఉన్నారా? మీ కన్నీటిని లెక్కించే దేవుడు మీతోనే ఉన్నారు. ఓదార్పును వెతుక్కొంటు మనుష్యుల యొద్దకు కాదు దేవుని యొద్దకె వెళ్ళండి. చేయి పట్టి నడిపించే వాడు మరణం వరకు మన తోనే ఉంటాడు. ఆయనే మీ దుఃఖమును సంతోషంగా మార్చుతారు. సమూయేలు మొదటి గ్రంధం 1వ అధ్యాయంలో హన్నా గురించి మనం చదువుతున్నాం. ఆమెకు సంతానం లేకపోవడం వలన అనేకులు ఆమెను బాధపరిచారు. ఆమె బహు దుఃఖా క్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. ఆమె యొక్క పెదవులు మాత్రమే. కదులుచుండి ఆమె స్వరము వినబడక యుండెను. అయితే దేవుడు ఆమె కన్నీటి శబ్దము విన్నారు. ఆయన హన్నా యొక్క కన్నీటిని ఆనందంగా మార్చి సమూయేలును ఆమెకు ఇచ్చారు. హన్నా మనుష్యులను వెతుకొంటు వెళ్ళలేదు దేవునిని నమ్మి ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వచ్చింది. అద్బుతమును పొందుకొంది. అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం, కన్నీటిని లెక్కించే వాడు మన దేవుడైన ప్రభువు మాత్రమే. హల్లెలూయా!

- శ్రీమతి. మంజుల గారు

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో జరుగుతున్న ఉజ్జీవం ఆశించే వారి కూటములలో దేవుడు తన మహిమను బయలు పరచులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al