Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.09.2022
Share:

By Village Missionary Movement

Thursday, 15-Sep-2022

దిన ధ్యానము(Telugu) 16.09.2022

 

అంశం:- ధారళం

 

"వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను" – 2 కోరింథీయులకు 8:4

 

ధారాళం అనే మాటకు 20వ శతాబ్దంలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణగా మీ ముందు ఉంచాలి అని ఆశ పడుతున్నాను. స్టాన్ ఫోర్ట్ కెళ్లి అనే మిషనరీ హైతి అనే దేశమునకు వెళ్ళాడు. అతను పరిచర్య చేస్తున్న చిన్న సంఘంలో కానుకలు వేసినప్పుడు అందులో మూడు వందల రూపాయలకు సమానమైన ఒక కరెన్సీ నోటును చూసాడు. పేదరికంలో నిండి ఉన్న ఆ దేశంలో ఆ నోటు ఒక నెల జీతంతో సమానం. బాగా డబ్బు ఉన్న దేశంలో ఒక లక్ష రూపాయల చెక్కును కానుకగా ఇచ్చుటను చూసిన బోధకుడు ఎంత సంతోషిస్తాడో అలానే కెళ్లి దానిని చూసిన వెంటనే చాలా ఆశ్చర్యపోయాడు. ఈ అసాధారణమైన కానుకను ఒక రైతు వేసాడు అని కనుగొన్నాడు. కెళ్లి నేరుగా ఆ రైతును ప్రశ్నించగా ఆ రైతు సమాధానం చెప్పుటకు బయపడ్డాడు. మళ్ళీ మళ్ళీ అడగడంతో తన జీవితమునకు ఆధారంగా ఉన్న గుర్రాన్ని అమ్మి ఆ రైతు చెప్పాడు. నేరుగా మీరే వచ్చి ఆ కానుకను ఎందుకు ఇవ్వలేదు అని కెళ్లి అడిగారు. అందుకు ఆ రైతు వేసుకోవడానికి నా యొద్ద చొక్కా కూడా లేదు అని బదులు ఇచ్చాడు. ఈనాడు మనం కానుకలు ఇచ్చే విధం ఎలా ఉంది. మనం ఎవరికి తెలియకుండా మనస్ఫూర్తిగా ఇస్తున్నమా?.లేదా అందరికి తెలియాలి అనే ఆలోచనతో ఇస్తున్నమా? మనం దేవుని కొరకు కానుక ఇచ్చినప్పటికీ మనుష్యులు పొగడాలి అనే తలంపుతో ఇస్తున్నాం. మనం ఇచ్చేది ఓ నలుగురికి తెలియాలి అనే మనస్సే మనలో ఉన్నది. కాని ప్రభువైన యేసు ఒకసారి దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఒక బీద విధవరాలు వేసిన కానుకను గూర్చి చెబుతున్నారు. ఆమె తన జీవితమునకు ఆధారముగా ఉన్న ఆ రెండు కాసులను కానుకగా ఇచ్చింది. అదేవిధంగా మాసిదోనియ సంఘ ప్రజల గురించి వారి సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారని సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పౌలు చెబుతున్నాడు. బీద విధవరాలి వలె ప్రభువు యొద్దనుండి పొగడ్తలు పొందుకున్న లాగున మనకు ఉన్న దానిని ఇద్దామా? నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండ ఉండ వలెను అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. కాబట్టి పైన చెప్పబడిన వారి వలె వుండులాగున ధారాళముగా ఇద్దాం దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యం పొందుకుందాం. ఆమెన్.

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు

 

ప్రార్థన అంశం:-

మీడియా పరిచర్యలో పని చేస్తున్న సేవకులను దేవుడు ప్రత్యేకమైన ఆత్మతో నింపి నడుపులాగున ప్రార్దిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet