By Village Missionary Movement
Wednesday, 14-Sep-2022దిన ధ్యానము(Telugu) 15.09.2022
అంశం:- యుద్దాయుదం
"అపవాదినిఎదిరించుడి" - యాకోబు 4:7
ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ప్రతి రోజు ఆత్మీయ పోరాటం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క దేవుని బిడ్డ ఒక్క రోజును కూడా రోజును ప్రారంభించకూడదు. హర్ కెన్ అనే రచయిత ఒక పత్రికలో ఇలా రాసారు. ఆఫ్రికాలో అత్యంత వేగంగా పరిగెత్తే గజల్ అనే జింక ప్రతి రోజు లేస్తుంది. లేచినప్పుడల్లా నన్న తరిమి సింహం కన్నా నేను వేగముగా పరిగెత్తకపోతే నేను చంపబడతాను అనుకొంటుంది. అదే విధంగా సింహం కూడా నిద్ర లేస్తుంది. నిద్ర లేచినప్పుడల్లా నేను జింక కన్నా చాలా వేగంగా పరిగెత్తకపోతే ఆరోజు ఆకలితో ఉండాల్సిందే అని అనుకొంటుంది. కాబట్టి నీవు సింహం అయిన జింక అయిన లేదా వేరే ఎవరైనా వేగంగా పరిగెడుతూనే ఉండాలి అని వ్రాసారు. నీవు దేవున్ని వెతకక పోతే సాతాను నిన్ను వెతుక్కొంటు వస్తాడు అని స్పర్జన్ అనే దేవుని సేవకుడు వ్రాసారు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహాము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదుకుచు తిరుగు చున్నాడు. కాబట్టి ప్రతి రోజు దేవుని యొక్క రక్షణ కరమైన రెక్కల క్రింద దాక్కోవాలి. ఎప్పుడు? వేకువజామున. ప్రతి రోజు వేకువజామున దేవున్ని వెతికి ఆయనను మనకు ఆశ్రయముగా చేసుకోవాలి. ప్రతి క్షణం అపవాది తీసుకొచ్చే పాపపు శోధనల నుండి మనం తప్పించు కొనుటకు అది ఒక్కటే ఆయుధం. అపవాదిని ఎదిరించే బలం వేకువజామున మనం పొందుకోవాలి.
ప్రియమైన వారలారా! ప్రతి రోజు వేకువజామున దేవున్ని వెతికి బలమును పొందుకొని పరుగును మొదలు పెడదాం. ఈ లోకమును మరియు అపవాదిని ఎదిరించుటకు మన సొంత బలం సహాయపడదు. దేవుని బలం మాత్రమే దేవున్ని జయించే జయం. కాబట్టి దేవుని బలముతో ప్రతి రోజు అపవాదిని ఎదిరించినప్పుడు నిశ్చయముగా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. ఆమెన్.
- శ్రీమతి. గీత రిచర్డ్.
ప్రార్థన అంశం:-
మనం సిద్ద పరుస్తున్న పత్రికలు ముద్రించుటకు కావాల్సిన సహాయం దేవుడు దయ చేయులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin