Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.09.2022
Share:

By Village Missionary Movement

Monday, 12-Sep-2022

దిన ధ్యానము(Telugu) 13.09.2022

 

అంశం:- మోసపోవద్దు.

 

"సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి" - 1థెస్సలొనికయులకు 5:21

 

కొన్ని రోజుల క్రితం చెన్నై లో నివసించే ఓ నకిలీ లాయర్ గురించిన వార్తను చదివాను. తాను ఒక లాయర్ అని 20 సంవత్సరాలుగా తన కుటుంబమును మరియు అనేక మందిని మోసం చేస్తూ వచ్చాడు. ఇతని నకిలీ తనం ఒక రోజు బయట పడడంతో నమ్మకం పెంచుకున్న అనేక మందికి మోసమే మిగిలింది. ఇదే విధంగా అనేక సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక వైద్యుడు దొంగగా దొరికి పోయాడు. ఆ నకిలీ డాక్టర్ నివసిస్తున్న నగరం మేయర్. ఇతను ఇంగ్లాండ్ నుండి తప్పించుకొని మన నగరంలో ఆశ్రయం పొందుతున్నాడు అని అతని గురించి ప్రకటించారు. ఆ వైద్యుని పట్ల మంచి ఆలోచన కలిగిన ప్రజలకు ఈ వార్త పెద్ద దిగ్భ్రాంతిని కలిగించింది. 

 

అపోస్టులులు పుస్తకంలో యేసుక్రీస్తు తరువాత తాము క్రీస్తు అని ప్రకటించిన వారును వారికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి అనే సంగతి అపోస్తులుల కార్యములు 5 వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎవడును మిమ్మును మోసపరచ కుండా చూచుకొనుడి నేనే క్రీస్తును అని చెప్పి మిమ్మును మోసపరిచెదరు అని చెప్పుటను పరిశుద్ధ గ్రంధంలో మనం చదువుతున్నాం. అపవాది నేరుగా మనలను మోసం చెయ్యడు కాని చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కరినీ మోసం చేస్తాడు. వాడి మోసపూరిత మైన మార్గంలో చిక్కుకొని ఇతరులపై లోటులను చెప్పడంలో అర్థం ఏమియు లేదు. మాట్లాడే ప్రతి ఒక్కరి మాటలను ఉన్నది ఉన్నట్లుగా నమ్మకుండా పరిశుద్ధ గ్రంధం ఏమి చెబుతుంది అనేది పరిశుద్ధ గ్రంధం చదివి పరిశుద్ధ గ్రంధం చూపే వెలుగులో వివేచించి చూడాలి. మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటారు అని అనేక మంది చెప్పుటను మనం వింటూనే ఉంటాము. 

 

ప్రియమైన వారలారా! అపోస్తులుడైన పౌలు వ్రాసిన పత్రికలలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని వ్రాసారు. అపవాది తంత్రములకు ఆహారం అయిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధాత్ము దేవుని మూలముగా తెలియ జేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండుటకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయం చేయును గాక!

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి జిల్లాలో గిద్యోను వంటి 300 మంది యవ్వనులు లేచులాగున మరియు వారు ఒక గంట ప్రార్ధించే వారిగా, ఒక గంట పరిచర్య చేయుటకు సమర్పించు కొనులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet