By Village Missionary Movement
Sunday, 11-Sep-2022దిన ధ్యానము(Telugu) 11.09.2022
అంశం:- ఉత్తమ లక్షణం.
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
"నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు" - కీర్తనలు 32:5
హాలో పిల్లలు ఎలా ఉన్నారు? ప్రతి వారం కథ వింటున్నా బోరు కొట్టడం లేదు కదా. సంతోషంగా కథ విన్నట్లే దాని ప్రకారంగా నడుచుకోవాలి సరేనా! స్కూల్ కి టైం అయ్యింది ఏం చేస్తున్నావే త్వరగా రా అసంబ్లీ ప్రేయర్ స్టార్ట్ అవ్వబోతుంది. అసలే పిటి టీచర్ ప్రశ్నలు వేసి చంపేస్తారు అని మాల కళని పిలుస్తుంది. ఇదిగో వచ్చేస్తున్నా అని సైకిల్ తొక్కుకొంటూ కళ వెళ్ళింది. ఇద్దరు కలిసి సైకిల్ తొక్కుకొంటూ వెళ్తున్నప్పుడు గీత పరిగెత్తుకొని అలసటగా వచ్చింది. ఏ మాల నా సైకిల్ రిపేర్ అయిపోయింది ఈరోజు మాత్రం నేను నీ సైకిల్ లో వస్తానే అని అడిగింది. నీవు గుమ్మడి కాయలా లావుగా వున్నావు నిన్ను నా సైకిల్ పైన ఎక్కించు కొని తొక్కలేను అని నవ్వుతూ కళ అంది. లేదు లేదు నేను తొక్కుతానులే నువ్వు వెనుక కూర్చో అని గీత చెప్పడంతో ముగ్గురు కలిసి వేగంగా స్కూల్ కు వెళ్లిపోయారు. పిల్లలు మీరు కూడా తొందర తొందరగా స్కూల్ కు వెళ్తారా? అలా ఉండ కూడదు. త్వరగా లేచి నిదానంగా బయలు దేరితే టెన్షన్ లేకుండా సంతోషంగా వెళ్ల వచ్చు కదా. మాల, కళ, గీత ఈ ముగ్గురు స్నేహితులు. గీత మంచి పిల్లలా ఉండాలి అనుకొంటుంది. ఆ రోజు టీచర్ కొంచం సమయం ఆఫీస్ పని మీద వెళ్లడంతో క్లాస్ లీడర్ ను పిలిచి ఎవరైనా మాట్లాడితే వారి పేర్లు వ్రాసి ఉంచు అని వెళ్లిపోయారు. ఈ ముగ్గురు మాత్రం మాట్లాడుతూ ఉండడం వలన లీడర్ వారి పేర్లు వ్రాసి టీచర్ వచ్చిన వెంటనే ఇచ్చింది. వెంటనే మాల లేచి టీచర్ మేము మాట్లాడనే లేదు తను కావాలి అని మా పేర్లు వ్రాసింది అని అబద్దం చెప్పింది. కాని గీత లేచి లేదు టీచర్ మేము నిజంగానే మాట్లాడుతూ నవ్వుతూనే ఉన్నాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పింది. వెంటనే టీచర్ అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పి చేసిన తప్పును ఒప్పుకోవడం చాలా మంచి లక్షణము. చేసిన తప్పును దాచిపెట్టినప్పుడు గొడవలు వస్తాయి. ఇందువలన మీ కుటుంబము మరియు చుట్టూ ఉన్న వారి పైన ప్రభావం కలుగుతుంది. మీ తప్పును ఒప్పుకున్నప్పుడు సంతోషము సమాధానము కలుగుతుంది. ఏంటి పిల్లలు మీరు సమాజానికి మంచి దారి చూపేవారిలా ఉండాలి అని టీచర్ చాలా చక్కగా చెప్పారు. ఏంటి పిల్లలు మీరు కూడా టీచర్ చెప్పిన దానిని అనుసరించడానికి రెడీయేనా? సరే పిల్లలు ఎప్పటిలాగానే ఈ రోజుకూడా కంఠస్థ వాక్యం నేర్చుకుందాం.
- సిస్టర్. ఏ. బ్యూలా గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250