Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.09.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 06-Sep-2022

దిన ధ్యానము(Telugu) 07.09.2022

 

అంశం:- విలువైన వస్తువులు.

 

"నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని" - యెషయా 38:5

 

ఒక రోజు ఒక దేవదూత పరలోకం నుండి భూమికి దిగి వచ్చాడు. భూమి పైన ఉన్న విలువైన వస్తువులను పరలోకమునకు తీసుకొని వెళ్తాను అని నిర్ణయించు కొని ప్రతి స్థలంలో వెతుకుతూ ఉన్నాడు. అందమైన అడవులు, అక్కడ ఉన్న పువ్వులు, పక్షులు, కన్నులకు ఇంపైన జలపాతాలు ఇలా ప్రకృతి దృశ్యాలు చాలా అందముగా ఉన్నాయి. కాని ఇవి అన్నీ పరలోకంలో ఇంకా అందంగా ఉంటాయి కదా! అనుకొని వాటిని విడిచి పెట్టి మనుష్యులు అధిక విలువ ఇచ్చే బంగారమును చూసాడు. కాని పరలోకంలో అంత బంగారమే అనుకొని తిరిగి పరలోకమునకు వెళ్తున్న సమయంలో ఒక ఇంట్లో నుండి ఏడుపు శబ్దం వినిపించింది. యేసయ్య పాపములో మునిగి పోతున్న ప్రజలను రక్షించండి అని ఒకతను ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అతని కన్నుల నుండి కారుతున్న కన్నీటిని చూసాడు. దీని కంటే విలువైనది ఈ భూమి. పైన ఏదియు లేదు అని చెప్పి తన చేతులతో ఆ కన్నీటిని చుక్కలను పట్టుకొని యేసుక్రీస్తు యొద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ లోకం లోకంలో ఉన్న వస్తువులను ఆధారం చేసుకుని ఒకరికి విలువ ఇస్తుంది. కాని కన్నీటి విలువ తెలిస్తే చాలు దేనినైనా సాధించ వచ్చు. నెహెమ్యా తన కన్నీటి ప్రార్థన వలన సాదించుటను మన పరిశుద్ధ గ్రంధంలో మనం చూస్తున్నాం. నెహెమ్యా అర్తహషస్త రాజునకు గిన్నె అందించే వాడు. కాని యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయ బడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయ బడినవి అనే వార్తను యెరూషలేము నుండి వచ్చిన తన సహోదరులు మూలమున తెలుసు కున్నాడు. అందువలన ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మందలి దేవుని వైపు చూసి విజ్ఞాపన చేసి రాజు యొద్దకు అతను పనికి వచ్చేస్తాడు. కాని అతని కన్నీరు యొక్క విలువ రాజు తనను విచారించేలా చేసింది. ప్రకారము కట్టుటకు నెహెమ్యాకు ఏవేవి అవసరమో వాటన్నింటిని ఇచ్చేలా చేసింది. 70 సంవత్సరాలుగా పడద్రోయ బడి ఉన్న ప్రకారము 52 రోజుల్లో కట్టబడింది. ఇది నెహెమ్యా యొక్క కన్నీటి ప్రార్ధనకు కలిగిన విజయం. మనము కూడా అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిదిలి కన్నీరు కారుద్దాం. అందరూ రక్షించ బడాలి అన్నదే దేవుని చిత్తం అయి ఉన్నది. ఆ దర్శనము కొరకు కన్నీరు కార్చి ప్రార్దించి నప్పుడే దేవుడు మన ద్వారా క్రియలను జరిగించగలరు. ఆత్మలను పరలోకమునకు తీసుకొని వెళ్లుటకు మన కన్నీటిని సమర్పిద్దాం. మనం తీసుకొని వెళ్ళవలసిన ఒకేఒక నిధి అయిన ఆత్మలను సంపాదిద్దాం. విజయ వంతమైన జీవితమును జీవిద్దాం.

- సిస్టర్. ఏ. బ్యూలా గారు.

 

ప్రార్థన అంశం:-

సేవ స్థలాల్లో జరుగుతున్న ఉజ్జీవం ఆశించే వారి కూటములో పాల్గొంటున్న వ్యక్తులు క్రియ జరిగించు లాగున, ఉజ్జీవం కలుగు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet