Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.09.2022
Share:

By Village Missionary Movement

Monday, 05-Sep-2022

దిన ధ్యానము(Telugu) 06.09.2022

 

అంశం:- ఎదురు చూపు.

 

"నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి" - మత్తయి 5:44

 

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం వలన భూమి మాత్రమే కాదు మన మనస్సు కూడా చల్లబడింది. ఆలోచించి చూడండి వర్షం అనేది భూమి పైన జీవిస్తున్న మన అందరికి ఎన్నో మేలులు కలుగజేస్తుంది. కాని ఆ వర్షాన్ని ఆస్వాదించే మనం తిరిగి దాని కొరకు ఏమి చెయ్యడం లేదు. అయినను ఏ భేదం లేదుకుండా సమానంగా అందరికి మేలు చేస్తుంది. పరిశుద్ధ గ్రంధంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గల కొండ మీద ప్రసంగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్తున్నారు. దానికి అర్థం మన వారికి సహాయం చెయ్యాలి అది కూడా మనం తిరిగి ఏది ఆశించ కూడదు అని. ఇంకా చెప్పాలి అంటే మనం ఆశించి సహాయం చేసినట్లుయితే మనం పరిసయ్యుల వంటి వారము అని చెప్పబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తున్న మనం మన యొక్క ప్రేమలో ఆయనను వ్యక్త పరచాలి. మన ప్రవర్తనలో మార్పు కలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి ఎదురుచూపు చూడకుండా మనం ఆయనకు తిరిగి ఏమియు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన కొరకు మన రక్షణ కొరకు త్యాగం చేశారు. కాని ఈనాడు మనం చాలా సమయాల్లో మనలను ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తూ మనలను ద్వేషిస్తున్న వారిని ద్వేషిస్తున్నాం. ఇది అన్యోన్యతను ఆశించే ప్రేమ అవుతుంది. కాని మన యొక్క ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి అనేదే ప్రభువైన దేవుని ఆశ . కాబట్టి దేనిని తిరిగి ఆశించకుండా కష్టాల్లో ఉన్న వారికి నిజాయితీగా సహాయం చేసినప్పుడు దేవుని నామం మహిమ పరచబడతుంది. అంత మాత్రమే కాదు అనేకులు దేవుని ప్రేమను రుచి చూసి చూచుటకు సహాయ పడుతుంది. 

- శ్రీమతి.స్టెఫీ రాక్ సన్.

 

ప్రార్థన అంశం:-

గ్రామ పరిచర్యలకు వెళ్తున్న సేవకుల యొక్క ప్రయాణాలలో దేవుని సంరక్షణ ఉండు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet