Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.09.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 04-Sep-2022

దిన ధ్యానము(Telugu) 05.09.2022 (Youth Special)

 

అంశం:- క్రీస్తు లో మంచి ఉపాధ్యాయుడు

 

"నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు." - యెహేజ్కేలు 34:15

 

నేటి తరంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉపాధ్యాయుడుగా అని ఖ్యాతి పొందుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యముగా క్రీస్తులో మంచి పేరు కలిగి మంచి సాక్ష్యము పొందుకున్న ఒక ఉపాద్యాయుడు వలె ఉండుటయు భవిష్యత్తు తరమైన విద్యార్థులను క్రీస్తు ప్రేమతో పెంచుట అనేది చాలా అధికమైన సవాలుతో కూడుకున్నదిగా ఉన్నది. గత12 సంవత్సరాలుగా నా ప్రయాణం విద్యార్థుల తో ఉపాద్యాయునిగా, ప్రిన్సిపాల్ గా మరియు నిర్వాహకుడిగా నాకు చాలా పాఠాలు నేర్పింది. అనుదినము దేవుడు నన్ను నడిపించిన విడమును చూసినప్పుడు అది ఆశ్చర్యకరముగా ఉంటుంది. ఇంకా ఆయన కొరకు అనేక సాధనాలు చేయాలని అనిపిస్తుంది. నాకు దేవుడు ఇచ్చిన పిలుపుద్వారా నేను ఈ పనిలో నేర్చుకున్న వాటిని మీతో పంచుకుంటాను. 

 

1. మనయొద్ద ఉన్నది దేవుని మంద - (1పేతురు5:2) వాక్యం మూలముగా మనము ఎటువంటి పని చేసినా మనకు అప్పగింపబడిన విద్యార్థులు, ఉద్యోగులు వీరిని దేవుని మందవలె భావించాలి. అప్పుడే వారిని గూర్చిన ఆత్మ భారం. అప్పుడే వారి అవసరతలను గూర్చిన సహాయం చేసే గుణం, వారి గ్రహింపును, మానసిక ఒత్తిళ్లను అర్థం చేసుకొనే స్వభావం బయలు పడుతుంది. 

 

2. మంచి కాపరి యొక్క మంచి లక్షణాలు బయలు పరచబడాలి. 1పేతురు 5:2-4 లో చెప్ప బడిన విధముగా మనం మన యొక్క నాయకుల బలవంతం పేరుతో ఒత్తిడితో నవ్వుతో అధికారం చేజిక్కించు కోవడం లేదా నీచమైన ప్రాపంచక లాభం కోసం విద్యార్థులను వాడుకోన కూడదు. మంచి కాపరి అయిన యేసుక్రీస్తు వలె మనస్ఫూర్తిగా మందకు మాదిరి వలె సమస్త క్రియలలో మంచి ఉదాహరణగా ఉండి పర్యవేక్షించాలి. ఎంత మాత్రం అధికారం చెల్లించకూడదు. అధికారి అయిన ప్రధాన కాపరి వచ్చినప్పుడు మహిమ గల కిరీటం పొందుకుంటాం అని విశ్వసించి ధైర్యముగా నడుచు కోవాలి. చివరిగా రోగులపై ప్రత్యేకమైన శ్రద్ద చూపించుటకు పరిశుద్దాత్ముని అభిషేకం మరియు పరిశుద్దాత్ముని జ్ఞానం చాలా అవసరం. 

 

యెహేజ్కేలు 34: 4 లో గలా వాక్యం ద్వారా చెప్పబడిన విధముగా బలహీనమైనవాటిని బలపరచాలి, రోగముగలవాటిని స్వస్థపరచాలి, గాయపడిన వాటికి కట్టుకట్టాలి, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరావాలి, తప్పిపోయినవాటిని వెదకాలి ఇలా న్యాయముగా మేపే మంచి కాపరి వలె బేధము లేకుండా లేఖనముల ఆధారంగా శ్రద్ద గలిగిన గురువు వలె వ్యవహరించి నప్పుడు క్రీస్తులో మంచి పేరు సంపాదించడం సాధ్యమే. ప్రార్థన మరియు బైబిల్ ధ్యానం దీనికి పూనాది. హల్లెలుయా!

- శ్రీమతి. మెర్సి జెస్సిందా.

 

ప్రార్థన అంశం:-

మిషనరీల యొక్క పిల్లల కొరకు వారి యొక్క శరీర ఆరోగ్యం కొరకు మరియు వారి యొక్క చదువు కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al