By Village Missionary Movement
Saturday, 03-Sep-2022దిన ధ్యానము(Telugu) 04.09.2022 (Kids Special)
అంశం:- పిచ్చుక
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
"ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము" - రోమీయులకు 8:15
మీరు పిచ్చుక గూడు కట్టుట చూసారా? ఓ మీరు కూడ కడతారా? ఎలా సముద్ర తీరమునకు వెళ్ళి ఇసుకతో గూడు కట్టి ఆడుకుంటారా. చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది కదా. మీరందరూ చేతులతో ఇల్లు కట్టి ఆడుకుంటారు. కాని పిచ్చుకకు చేతులు ఉండవు కదా కాని అది గూడును ఎలా కడుతుంది. హ చాలా చక్కగా చెప్పారు. నోటితో కడుతుంది కదా. అవును అది ఎలా గూడు కట్టి సంతోషంగా ఉందొ కథ లో తెలుసు కుందామా!
ఒక అందమైన పిచ్చుక తన కొరకు ఒక అందమైన గూడు కట్టడం ప్రారంభించింది. చిన్న చిన్న కర్రలు, కొబ్బరి నారలు ఇలా కొన్నింటిని ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి చక్కగా కడుతూ ఉంది. హఠాత్తుగా బలమైన గాలి వీచడం వలన ఆ గూడు చెదరి క్రింద పడిపోయింది. మరి కొన్ని కర్రలు తీసుకొని తన గూడు దగ్గరకు వచ్చిన పిచ్చుక క్రింద పడిపోయి ఉన్న గూడును చూసి ఏడ్చింది. అయ్యో నేను కష్టపడి గూడు కట్టుకున్నాను అది క్రింద పడిపోయిందే అని బాధపడి ఉంటుంది అనుకొంటున్నారా? ఇది మాత్రమే కాదు ఇలాంటి గూడులు ఎన్ని అయిన కడతాను. నా పరమ తండ్రి ఉన్నారు కదా ఆయన నాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్తూ ఎగిరి వెల్లి కొన్ని రోజుల్లో మరల మంచి గూడును కట్టి పూర్తి చేసింది. క్రింద పడిపోకుండా సేఫ్ గా ఉందా లేదా అని చూసి ఆ గూడు లో కొన్ని గుడ్లు పెట్టి పొదిగి అందమైన పిల్లలను చేసింది. అంత మాత్రమే కాక తన పిల్లలకు మంచి ఆహారం అందించి వాటిని బాగా చూసుకొంది. ఆ చిన్న పిచ్చుక యొక్క కుటుంబం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా! ఏ పిచ్చుక నువ్వు మాత్రమే ఎలా హ్యాపీగా అలసిపోకుండా నీ పనులను చేయగలుగుతున్నావ్ అని అడగాలి అనిపిస్తుందా? తమ్ముడు చెల్లి పిచ్చుక కూడా తనను సృష్టించిన జీసస్ యొక్క ఉద్దేశ్యమును ఎరిగి అలసిపోకుండా సంతోషంగా తన బాధ్యతలను నెరవేర్చింది చూసారా? అయ్యో ఈ సబ్జెక్టులో నేను ఫైల్ అయ్యాను ఇది చాలా కష్టంగా ఉంది అని కృంగిపోకూడదు. మీకు సహాయం చేయుటకు ఒక తండ్రి ఉన్నారు అని మర్చిపోకూడదు. సరేనా? సరే పిల్లలు మనం అలసిపోకుండా హ్యాపీగా మన పనులను చెయ్యాలి అని నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చు కొందామా?
- సిస్టర్ . దేబోరా.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250