By Village Missionary Movement
Saturday, 03-Sep-2022దిన ధ్యానము(Telugu) 03.09.2022
అంశం:- ఫ్రీ.
"ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి" - మత్తయి 10:8
ఈనాడు ఆనేక మంది మధ్యతరగతి వారు ఉచితమును ఇష్టపడుట లేదు. ఎందుకు అనగా ఉచితం అనేదానికి విలువ లేనిది అని అంటూ ఉంటారు. కాని ఒకతను తాను కనుగొన్న దానిని ఈ లోకమునకు ఇచ్చాడు. జోన్స్ ఎడ్వర్డ్ అనే జీవ శాస్త్ర పరిశోధకుడు ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా పోలియో వెక్షన్ కనుగొన్నాడు. ఇతను కనుగొన్న వ్యాక్సిన్ కు రాపిడ్ హక్కు పొందలేదు. ఒక వేళ పొంది ఉంటే ఈనాడు దాని యొక్క విలువ వేల కొలది రూపాయలకు చేరుకొనేది. కాని ప్రపంచంలో ఉన్న పేద, అనాధ ప్రజలకు వ్యాక్సిన్ అందాలి అని రాబిడి హక్కును పొందకుండా వదిలేశాడు. అందువలన ప్రభుత్వం దీనిని ప్రపంచమంతా ఉచితంగా సరఫరా చేస్తుంది. దీని గురించి ఒకసారి ఇతనికి మీరు కనుగొన్న దానికి ఎందుకు రాబిడి హక్కును పొందుకొనలేదు అని అడిగినందుకు అతను సూర్యునికి ఎవరైనా రాబిడి హక్కు అడుగుతారా అనియు సూర్యుడు అందరికి సంబంధించిన వాడనియు దాని మూలముగా ఈ ప్రపంచంమే జీవిస్తుంది. కాబట్టి నేను కనుగొన్న దానికి ఈ ప్రపంచానికి ఫ్రీ గా ఇచ్చాను అని బదులు ఇచ్చాడు.
ప్రభువైన యేసు భూమి పైన జీవించిన రోజుల్లో తన శిష్యులకు ఎన్నో మంచి విషయాలు బోధించారు. ఆయన బోధించిన విధముగా కార్యములు జరిగించి చూపించారు. అలా ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన దానిలో ఒకటి ఉచితముగా పొందిరి ఉచితముగా ఇయ్యుడి అనేదే.
అవును ప్రియమైన వారలారా! ఈనాడు మన జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం వంటి చాలా రకాలైన ఆశీర్వదములు పొందుకొని సంతోషంగా ఉన్నాము. వాటి కొరకు ఎటువంటి వేలను చెలించుట లేదు. దీని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో సొంత రక్తమును చిందించారు. మనం దాని విలువను గ్రహించకుండా నిర్లక్ష్యం చేసి మరచి పోతున్నాం. అది మాత్రమే కాదు మనం పొందుకున్న వాటిని ఇతరులకు ఉచితముగా ఇవ్వమని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఏడ్వార్డ్ అనే పరిశోధకుడు తను నేర్చుకున్న దానిని తన కొరకు దాచిపెట్టకుండా లోకానికి ఉచితంగా పంచి పెట్టాడు. అదే ఈనాడు వరకు అనేక ప్రాణాలు కాపాడుతూ వస్తుంది. అదే విధంగా మనం కూడా ఉచితంగా పొందుకున్న రక్షణను ఉచితంగా పంచి పెట్టినప్పుడు అనేక ఆత్మలు కాపాడబడతాయి అనే దాంట్లో సందేహమే లేదు. ఆమెన్.
- శ్రీమతి . శక్తి శంకర్ రాజ్ గారు.
ప్రార్థన అంశం:-
తమిళనాడులో ప్రతి శనివారం జరుగుతున్న ఉజ్జీవం ఆశించే వారి కూటమునకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు ఆటంకం లేకుండా వచ్చు లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250