Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.09.2022
Share:

By Village Missionary Movement

Thursday, 01-Sep-2022

దిన ధ్యానము(Telugu) 02.09.2022

 

అంశం:- చరిత్రను సృష్టించిన సామాన్య ప్రజలు

 

"నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని" - యోబు 42:2

 

రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత ఒక యుద్ద సైనికుడికి ఇంటికి వెళ్ళడానికి సెలవు ఇవ్వబడింది. అతడు తన ఇంటికి వెళ్ళే దారిలో తన ఇంటికి సమీపంలో ఉన్న వీధికి చేరుకున్నాడు. అక్కడ అపి ఉన్న సైనికుల వాహనాలలోనికి మృతదేహాలను ఎక్కించుట చూసినప్పుడు శత్రువులు తన నగరం పైన దాడి చేశారు అని అతనికి అర్థం అయ్యింది. సామూహిక సమాధికి తీసుకు వెళ్ళడానికి డజన్ల కొద్దీ సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ సైనికుడు కాసేపు ఆగాడు. హఠాత్తుగా ఒక మహిళ కాళ్లకు ఉన్న షూ ను అతడు గమనించాడు. ఇంతకు ముందు తన భార్యకు కొని ఇచ్చిన షూ వలె ఉన్నాయి. వెంటనే తన ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు. మరల వేగంగా తిరిగి వచ్చి వాహనములో ఉన్న ఆ శవాలను పరిశీలించాడు. అది తన భార్య అని చూసి షాక్ అయ్యాడు. తన భార్యను అన్ని శవాలతో కలిపి పాతి పెట్టడం ఇష్టం లేదు అని ప్రత్యేకంగా పాతి పెడతాను ఇవ్వమని అడిగాడు. అందుకు అనుమతి కూడా లభించింది. వాహనం నుండి ఆ శవాన్ని చాలా దుఃఖంతో బయటకు తీసినప్పుడు భార్య ఇంకా ప్రాణాలతో ఉండుట చూసి ఒక్కసారి ఆశ్చర్య పోయాడు. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు తనకు కావాల్సిన చికిత్స ను అందించి ఆమెకు ప్రాణం పోసారు. ఈ. ప్రమాదం జరిగిన చాలా సంవత్సరాల తరువాత దాదాపుగా ప్రాణాలతో సమాధి చెయ్యాలి అనుకున్న ఆ సైనికుని యొక్క భార్య గర్భం ధరించింది. ఆమెకు పుట్టిన బిడ్డ ఇంతకు ముందు అమెరికా అధ్యకుడి భార్య అయిన హిల్లరీ క్లింటన్. ఈ హిల్లరీ క్లింటన్ వ్రాసిన హాట్ చాయిసస్ అనే పుస్తకంలో ఈ సంఘటన వ్రాసారు. కాబట్టి సామాన్య ప్రజలు అని పిలువబడే అనేకుల ద్వారా చరిత్రను సృష్టింప జేయడం అనేది దేవునికి సాధ్యం. కట్టెలు కొట్టే వాడి కుమారుడైన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. చెప్పులు కుట్టే వాడి కుమారుడైన విలియం కెరీ భారతదేశంలో అనేకులు కన్నులను తెరిపించాడు. అతడు రాత్రి పగలు కష్టపడి మెళుకువగా ఉండి అనేక భాషల్లో పరిశుద్ధ గ్రంధం మును అనువాదించాడు. అనేక పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వ విద్యాలయలు స్థాపించాడు. సాధారణంగా చేపలు పట్టే పేతురు 3000, 5000, మందిని దేవుని చెంతకు చేరేలా మారుమనస్సు పొందు కొనేలా ప్రసంగించి ప్రధాన అపోస్తులుడయ్యాడు. తమిళనాడులో గల పుల్లల కోటై అనే గ్రామంలో యేసుని ఎరుగని ఒక కుటుంబంలో పుట్టిన సహోదరుడైన బ్రదర్ డేవిడ్ గణేషన్ వందలాది మంది మిషనరీలను అభివృద్ది చేసి సంస్థను స్థాపించి గ్రామ మిషనరీ ఉద్యమం యొక్క నాయకుడయ్యారు. ఎంతటి ఆశ్చర్యమైన దేవుని క్రియలో చూడండి. 

 

ప్రియమైన యవ్వనులారా! నువ్వు సామాన్యురాలవు కాదు. దేవుడు మీ ద్వారా అసాదారణమైన కార్యములు చేయగలడు. నిన్ను సాదారణమైన దానిగా మార్చుట దేవునికి సులువైన కార్యం. మీ జీవితంలో ప్రారంబం కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ది కలుగజేయు దేవుడు మీకు తోడై యున్నాడు. హల్లెలుయా!

- శ్రీమతి. జాస్మిన్ పాల్.

 

ప్రార్థన అంశం:

మన మిషనరీలు అందరిని దేవుడు మహిమ కరంగా వాడుకొను లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet