Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.09.2022
Share:

By Village Missionary Movement

Thursday, 01-Sep-2022

దిన ధ్యానము(Telugu) 01.09.2022

 

అంశం:- ప్రేమే గొప్పది.

 

"కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే." - 1కోరింథీయులకు 13:13

 

బెల్జియం కు చెందిన జోసెఫ్ డాన్యున్ అనే ఒకతను హవాయి దీవులలో ఉన్న కుష్టు రోగుల మధ్య సేవ చేయుటకు వెళ్ళాడు. ఆ కుష్టు రోగులతో స్నేహం పెంచుకోవాలనుకున్నాడు. కాని వారు ప్రక్కకు తప్పుకొని పోయారు. ఒక చిన్న ఆలయమును అక్కడ నిర్మించి ఆరాధన మొదలుపెట్టాడు. కాని అక్కడ ఉన్న ఎవ్వరూ కూడా దేవున్ని అంగీకరించలేదు. తన శక్తి అంతటితో వారికి సహాయం చేశాడు. పన్నెండు సంవత్సరముల తన ప్రేమ అంతటిని ఆ కుష్టు రోగులమీద చూపించినప్పటికి ఏమియు ప్రయోజనం లేదు. అంతా వృధా అయిపోయింది. అతను చివరిగా ఆ ధీవినుంచి వెళ్లిపోయేటప్పుడు తన అరచేతిని చూసాడు తన అరచేతిలో తెల్లని మచ్చలు స్పర్శ లేకుండా ఉన్నాయి. అతని కూడ కుష్ఠు వ్యాధి సోకింది అని ఎరిగి మరల ఆ దివికి వచ్చి వారి మధ్య పరిచర్య చేయడం ప్రారంభించాడు. అతనిలో ఉన్న ప్రేమ, జాలి ఏమాత్రం తగ్గలేదు. జోసెఫ్ కు కుష్ఠు వ్యాధి వచ్చింది అనే వార్త హవాయి మొత్తం వ్యాపించింది. ఆ వారం చర్చి అంత నిండిపోయింది. అతనికి ఉన్న వ్యాధిని కూడా లెక్కచేయకుండా మనలను ప్రేమిస్తున్నాడు అని అందరూ అనుకోని అంత అలయమునకు వచ్చి దేవున్ని అంగీకరించారు. దీనినే క్రీస్తు మన నుండి ఆశిస్తున్నా ప్రేమ. కాబట్టి ఆయన ఆజ్ఞలను న్యాయ ప్రమానములను ప్రేమతో మనకు ఇచ్చారు. నీ పూర్ణ హృదయం తోను నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సు తోను నీ ప్రభువును ప్రేమించ వలెను అనియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ వలెను అనియు మత్తాయి సువార్త 22:37,39 లో వ్రాయబడి ఉన్నది. దేవున్ని మరియు మనుష్యులను ప్రేమించాలి అంటే మన స్వార్థం తొలగి పోవాలి. స్వార్థం ఉంటే అహంకారం, గర్వమే కలుగుతుంది అలానే ప్రేమ కలుగదు. దేవున్ని ప్రేమించినప్పుడు ఆయన యొద్ద ఉన్న విశ్వాసం, నమ్మకం వాటంతట అవే వస్తాయి. క్రీస్తు మన జీవితంలో నిండి ఉంటారు. మనం మనుష్యుల ప్రేమించినప్పుడు ప్రేమ మన క్రియల ద్వారా నోటి ద్వారా కలుగుతుంది. అసంపూర్ణంగా ఉన్న మనం క్రీస్తు ద్వారా సంపూర్ణంగా మారినప్పుడు ప్రేమ మన జీవితం వలె మారుతుంది. ప్రేమలేకుండా దేనినైనా ఇవ్వగలం కాని ఏమి ఇవ్వకుండా ప్రేమించలేం అని ఏమికార్మికేల్ గారు చెప్పారు. 

 

ప్రియమైన వారలారా! మన జీవితంలో ఏది గొప్పగా ఉంది? శ్రేస్ట మైనది ప్రేమయే అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. జోసెఫ్ డాన్యున్ జీవితం చూసినప్పుడు ప్రేమే గొప్పది అని మనం గ్రహించవచ్చు. ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రకాశిస్తాము. మన వెలుగు యొద్దకు రాజులు వస్తారు. వచ్చి మన వెలుగుకు కారణమైన క్రీస్తు కొరకు తెలుసుకొంటారు. హల్లెలుయా!

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంత జరుగబోయే పరిచర్య అంతటిలో దేవుని హస్తం తోడై యుండు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş