Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.08.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 31-Aug-2022

దిన ధ్యానము(Telugu) 31.08.2022

 

అంశం:- అబద్ద సాక్ష్యం.

 

"నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు" - నిర్గమకాండము 20:16

 

నా చిన్నప్పుడు మా చర్చ్ లో మోక్ష ప్రయాణం అనే కధ ను తెరపై ఒక సినిమా వాలె చూపించారు. ఆ కథా నాయకుడు ఒక క్రిస్టియన్ మరియు అతని స్నేహితుడు నిజాయితీ పరుడు మాయా ప్రపంచానికి చేరుకుంటారు. అక్కడ ప్రదర్శన శాలలో లోకానుసారమైన కీర్తి, గర్వము వంటి వాటిని అమ్ముటను చూచి మేము నిజముగా కొంటాం అని వీరు చెప్పటంతో ఒక్కసారిగా వారిమధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో అంతా గందరగోళంగా మారుతుంది. కాబట్టి అక్కడ ఉన్న న్యాయమూర్తి వద్దకు పంపిస్తాడు. గర్వం, కీర్తి అనేవారు వీరు ప్రదర్శన శాలను ఆటంక పరుస్తున్నారు. అబద్ద సాక్ష్యం పలుకుతారు. మరలా పెద్ద గొడవ జరుగుతుంది. కాబట్టి నిజాయితీ గల వానికి మరణ శిక్ష విధించి ఒక కర్రకు కట్టి నిప్పంటించారు. ఈ విధముగా లోకంలో నిజాయితీ ని కాల్చివేసేశారు. 

 

అవును ప్రియమైన వారలారా! మనముకూడా ఒకరిని గురించి అబద్ద సాక్ష్యం పలికి వారి యొక్క మంచి పేరును ప్రఖ్యాతను దొంగిలించి వారికి ఉన్న నిజాయితీ ని చంపేస్తున్నాం. సమాజంలో ఉన్న మంచిపేరు దిగజార్చి అబద్ద సాక్ష్యం పలుకుట ఎంతటి దుర్మార్గం. మనం మన అవయవాలలో ఒక చిన్న నాలుకని ఉపయోగించి గర్వం తో లేదా మూఢనమ్మకం తో ఒకరిని గురించి అసత్య పుకార్లను వ్యాపింప చేస్తున్నాం. నిశ్శబ్దంగా లేదా శరీర క్రియల ద్వారా ఇతరులను అవమానించి క్రియలను అనుమతిస్తున్నాం. ఇది సమాజానికి ఎంతపెద్ద కీడు ఇతరులు వీటిని చూడకపోయిన ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా నీ పొరుగువాని మీద అబద్ద సాక్ష్యం పలుకకూడదు. అనే ఆజ్ఞ మూలముగా ఒకరి ప్రతిష్ట పట్ల దేవుని శ్రద్ధను చూస్తున్నాం. మనముకుడా దేవునికి భయపడి నిప్పువంటి ఈ నాలుక ద్వారాఇతరుల జీవిత చక్రమును పాడుచేయకుండా విషంతో నిండిన మన నాలుకను పరిశుద్ధాత్ముడు ముట్టులాగున ప్రార్ధిద్దాం. యేసుక్రీస్తు నోటను ఏ కపటము కనబడలేదని (1పేతురు 2: 22) వ వచనం చెపుతుంది. మనము కూడా ఇతరులు చెప్పేవాటిని, చేసేవాటిని మంచి మనసుతో అంగీకరిద్దాం. ఆమెన్!

- సహోదరి ఏ. బ్యూలా 

 

ప్రార్థన అంశం:-

తమిళనాడు లో జరుగుతున్న కరువుతో జరుగుతున్న ఉజ్జీవమును ఆశించేవారు ఎక్కువమంది వచ్చులాగున అక్కడ ఉజ్జీవము కలుగులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al