By Village Missionary Movement
Tuesday, 30-Aug-2022దిన ధ్యానము(Telugu) 30.08.2022
అంశం:- లైంగిక హింస.
"లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా.ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను" - ఆదికాండము 34:1
దేవుని సేవకుడైన యాకోబు కుటుంబంలో జరిగిన ఊహించని ఒక సంఘటనను అదికాండం 34వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యాకోబు యొక్క ఒకేఒక కుమార్తె అయిన దీనా పై షెకెము యొక్క దేశము కుమార్తెలను చూచుటకు వెళ్లిన స్థలములో ఆమె పైన లైంగిక హింస జరుగుట మనం చూస్తున్నాం. స్త్రీలకు విరుద్ధమైన ఇటువంటి హింసలు అనేక స్థలాల్లో జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే పోలీస్ స్టేషన్లో రోజుకు 88 కంటే ఎక్కువ లైంగిక వేధింపులు కేసులు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం సరాసరి 20,000 లకు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. 2012వ సంవత్సరం ఢిల్లీలో కదులుతున్న బస్సులో యువతిపైన హత్యాచారం జరిగింది. ఆ యువతి పై లైంగిక నేరస్తులు దారుణానికి పాల్పడ్డారు. ఆ యువతి రాత్రిపూట తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎందుకు బయటకు వెళ్ళింది అనేది ప్రజల యొక్క ఆందోళన. ఒక మహిళగా ఆమె లైంగిక వేధింపులను ఆహ్వానించిందా అనే ప్రశ్నలు మన దేశం అంతా ప్రతిధ్వనించాయి. జస్ట్ వాకింగ్ కు వెళదాం అనే ఆలోచన కూడా చాలా చోట్ల మహిళల భద్రతకు ప్రశ్నార్ధకంగా మారింది. మహిళలు భద్రత లేని ఇటువంటి ఘోరమైన ప్రపంచంలో జీవిస్తున్నారు అనే విషయం మరచిపోలేనిది.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా! ప్రభువే మన రక్షకుడు. ఆయన నిర్దేశించిన సరిహద్దుల్లో మనం వున్నప్పుడు కచ్చితంగా రక్షణ ఉంటుంది. మొబైల్ ఫోన్ల ద్వారా నేటి తరం సాతాను వలలో చిక్కుకొని ఉంది. మనం ఎక్కడికి వెళ్తే సురక్షితం కాదని తెలుసుకొనే మంచి భావం యొక్క నిశ్చయతను ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కాబట్టి జ్ఞానం కలిగి జీవిద్దాం. దీనిని నిర్లక్ష్యం చేస్తే మనకు అనవసరమైన నష్టాలు కలుగుతాయి. మన దేశంలో ఇటువంటి నేరాలు జరుగకూడదు అని ప్రార్దిద్దాం. హల్లెలుయా!
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.
ప్రార్థన అంశం:-
ప్రార్థన లతో మరియు కానుకలతో పరిచర్యకు మద్దతు ఇస్తున్న భాగస్వాముల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించు లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250