Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.08.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 29-Aug-2022

దిన ధ్యానము(Telugu) 29.08.2022 (Youth Special)

 

యవ్వనులకు ప్రత్యేకమైన సందేశం.

 

అంశం:- వాక్యం దొరకని కరువు.

 

"రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు" - ఆమోసు 8:11

 

చాలా దేశాల్లో ఆహార కొరత మరియు నీటి కొరత ఏర్పడుటను మనం ఎరిగి యున్నాం. కాని ఆమోసు ప్రవక్త ద్వారా యెహోవా మాట వినని వారికి కరువు ఏర్పడుతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఆహార కొరత ఏర్పడితే అది మన శరీరాన్ని బాధిస్తుంది. కాని యెహోవా మాటను వినక పోవడం వలన కలుగు క్షామము వలన మనుష్యుడు బలహీనుడు అవ్వడం మాత్రమే కాక చివరిలో పరలోకాన్ని కూడా కోల్పోతాడు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తున్నారు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయు చున్నవి అని యిర్మీయా ప్రవక్త వాక్యమును ఆహారము వలె భుజించు చున్నాను అని చెబుతున్నాడు. వర్షం కురవ నప్పుడు లేక యుద్ధం వలన ఆహార కరువు రావచ్చు. కాని వాక్యం వినుటకు వచ్చిన కరువు ప్రమాదకరమైనవి. గడిచిన సంవత్సరంలో కరోనా అనే అంటువ్యాది ప్రపంచం అంతా వ్యాపించింది. సంఘములు మూసి వేయడం వలన వాక్యం కరువు కలిగింది అని కూడా మనం అనుకొనవచ్చును. సాంఘిక మాధ్యమం ద్వారా మనం వాక్యమును వినుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించారు కదా. కాని ఈ విధముగా కూడా వాక్యం దొరకక కరువు రాబోవుచున్నది. 

 

ప్రియమైన యవ్వనులారా దేవుని మాటలు వినుటలో, వాటిని అనుదినం మన జీవితంలో అభ్యసించడంలో మనం ఉత్సాహంగా ఉనట్లయితే ఎటువంటి కరువు వచ్చిన సరే మనం ఎదుర్కొన వచ్చును. దేవుని వాక్యమును ధ్యానించ కుండా వాటి మూలముగా వచ్చిన ఆశీర్వాదములు పొందుకొనకుండా ప్రార్థన అనే దేవునికి మనకు మధ్యలో ఉన్న బంధంలో మనం జీవించ కుండా మనలను మన చుట్టూ వున్న వారిని రుగ్మతలకు గురిచేస్తున్న అపవాది క్రియల నిమిత్తం మనం సంరక్షించు కొనుటకు మన హృదయంలో దేవుని మాటలను నింపుకొందమా! మన పిల్లల హృదయమును దేవుని వాక్యముతో నింపి వారి ఆత్మను చిగురింప జేద్దామా! క్రీస్తు కొరకు శిష్యులను అభివృద్ధి చేద్దాం సమాజ రుగ్మతలనుండి మన దేశాన్ని కాపాడుదాం. హల్లేలూయా!

- బ్రదర్. పాల్ జబాస్టిన్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనుల కొరకు కావాల్సిన అవసరతలు సంధింపబడి త్వరగా పూర్తి కాబడే లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet