Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము:- 28-08-2022
Share:

By Village Missionary Movement

Sunday, 28-Aug-2022

దిన ధ్యానము:- 28-08-2022

 

 

అంశం:- ప్రారంభం- ముగింపు.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు. ఎప్పటి లాగానే ఈరోజు ఒక కథ విందామా! 

 

ఒక దేశంలో విగ్రహాలు చేసే పోటీ జరిగింది. అందులో చాలా మంది శిల్ప కారులు పాల్గొన్నారు. శిల్పి అంటే ఎవరో తెలుసా? వెరీగుడ్. శిల్పాలను చెక్కే వారే శిల్పి. ఆ శిల్పకారులకు కొన్ని స్థలాలు విభజించి ఇచ్చి 10 రోజుల్లో అందమైన శిల్పం చేయాలి అనేదే వారి పోటీ. అది కూడా మట్టితో చెయ్యాలి చక్కగా చేసిన వారికి అవసరమైన వస్తువులు ఇవ్వబడును అని చెప్పబడింది. పోటీ మొదలైయింది రాజు అనే అన్నయ్య చాలా జాగ్రత్తగా శిల్పం చెక్కడం మొదలు. పెట్టాడు. అందమైన రూపాన్ని చెయ్యడం మొదలు పెట్టాడు. అందమైన రూపంలో ఒక శిల్పాన్ని పూర్తి చేసి 8వ రోజున ఇంకా అందముగా చేయుటకు దానికి చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. 9వ రోజు చివరిలో అందరూ తమ పనులను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా కొంచం సమయమే ఉంది అంటూ ఏదేదో చేస్తున్నాడు రాజు. తరువాత ఆ శిల్పం చుట్టూ శుభ్రపరిచాడు. తరువాత ఆ శిల్పాన్ని ఒక కవర్ తో మూసి వేసాడు. అనవసరమైన పనిని ఈ రాజు చేస్తున్నాడు అని మిగతా వారు ఎగతాళి చేశారు. రాజు మాత్రం వారి మాటలను పట్టించి కోకుండా చక్కగా తన పనిని పూర్తి చేశాడు. మరుసటి రోజు ఉదయం పోటీ యొక్క ముగింపు. ఆ చెక్కిన శిల్పాలను చూచుటకు అందరూ సిద్ధంగా ఉన్నారు. శిల్పాలను చూసిన వారు చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అని అడుగుతున్నారా? అకస్మాత్తుగా వేకువ జామున కురిసిన మంచు వలన శిల్పాలు పాడైపోయాయి. కవర్ తీసి చూస్తే రాజు చెక్కిన శిల్పమే చక్కగా అందంగా ఉంది. రాజుకు మొదటి బహుమతి వచ్చింది. పోటీ పూర్తి అయింది అని ప్రకటించబడింది. తాము ఏదో విధంగా పూర్తి చేసేద్దాం అని చేసిన వారందరు వారి శిల్పాలు అన్నీ తడిసిపోవడం చూసి కృంగి పోయారు. రాజు అన్నయ్యకు బహుమతి మరియు రాజ భవనంలో శిల్పాలు చెక్కుటకు అవకాశం ఇవ్వబడింది. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి ఎవరేం చెప్పినా, స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్, అమ్మకు చేసిన సహాయం ఇలా మీకు ఇవ్వబడిన పనులను శ్రద్ధగా చేసినట్లయితే బహుమతులు మరియు పొగడ్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అది మాత్రమేన యేసయ్య కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.మిమ్మల్ని హెచ్చిస్తారు. ఏంటి పిల్లలు మీకు ఇవ్వబడిన పనిని జాగ్రత్తగా చేయుటకు రెడియేనా? సరే పిల్లలు ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చుకొందామా. 

 

 

 

"తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును". (సామెతలు 22: 29)

 

 

శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

 

తమిళ్ కొరకు +91 9444011864, ఇంగ్లీష్ కొరకు +91 8610984002 , హిందీ కొరకు +91 9385810496 , తెలుగు కోసం+91 9442493250.

 

ఈమెయిల్: dailydevotion@vmm.org.in Androidapp: https://play.google.com/store/apps/details?id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 9442493250. 

ఈ దిన ధ్యాన సందే శమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ ద్వారా పొందుటకు 9444011864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet