Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.08.2022
Share:

By Village Missionary Movement

Friday, 26-Aug-2022

దిన ధ్యానము(Telugu) 27.08.2022

 

అంశం:- సాంస్కృతిక రుగ్మత.

 

"ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి" - 2పేతురు 2:6

 

మన భారతదేశం సంస్కృతి మరియు సాంస్కృతిలో గల లక్షణాలతో నిండి ఉంది. కొద్ది కొద్దిగా పాశ్చాత్య సాంస్కృతి ప్రవేశించి మన దేశం రుగ్మతకు గురి అవుతుంది. దీని ఫలితంగా సాంఘీక మధ్యమాల ద్వారా కమ్యూనికేషన్ స్నేహాలు ఏర్పడి మగ వారితో మగవారు, ఆడవారితో ఆడవారు పెళ్లిళ్లు చేసుకోవడం, చిన్న పిల్లల పై లైంగిక వేధింపులు సాంఘిక మధ్యమాల్లో యువత ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం, అవిధేయులైన పిల్లలు విజయవంతమైన మార్గాలు కనుగొని విద్య లేకపోవడం, తప్పుడు దారిలో ఉద్యోగ అన్వేషణ, డబ్బు సంపాదన, రోడ్డు ప్రమాదాలు, సహాయం చెయ్యకుండా వీడియోలు తీయడం వంటివి చూస్తే మన సాంస్కృతి దిగజారిపోయింది అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అనేటటువంటి పరిస్థితి కలదా. అవి ఎప్పుడు పరిష్కరించ బడతాయి అని మనం అనుకొంటున్నామా? ఈ సమస్యలు సమాజంలో ఆగిపోకుండా సమాజ సంరక్షణకు ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్న సంఘాలలో ప్రవేశించడం అనేది అధికమైన వేదనను కలిగిస్తుంది. వీటన్నింటి ఒక సామాజిక సమస్యలుగా కాకుండా వ్యక్తిగత వ్యక్తుల ప్రవర్తన కారణముగా ఏర్పడిన ప్రభావముగా భావించాలి. అటువంటి అవినీతి సమాజం గురించి మరియు వాటి యొక్క నాశనము గురించి ప్రభువు ఏం చేశారో మనం పరిశుద్ధ గ్రంధంలో చూడవచ్చు. ఉదాహరణకు అదికాండం 11వ అధ్యాయంలో ప్రజల యొక్క గర్వం దేవుడు వారి భాషలను వేరు చేసేలా చేసింది. నోవహు కాలంలో జీవించిన ప్రజల పాపం వలన దేవుడు వారిని జల ప్రళయం ద్వారా నాశనం చేసాడు. లోతు కాలంలో జరిగిన అవినీతి విషాదం వలన దేవుడు వారిని అగ్ని ద్వారా నాశనం చేయుటను మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో యేసు మరణించి తిరిగి లేచాడు కాబట్టి అటువంటి విద్వాంసాలు లేకపోయినా ఈలోక మాలిన్యములను తప్పించు కొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింప బడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని వ్రాయబడి యున్నది. 

 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! తోమ తరువాత ఎందరో మిషనరీలు త్యాగం ద్వారా మనం దేవుని ప్రేమను ఎరిగి సంపూర్ణంగా ప్రభువైన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనం మన భారతదేశంలో ఈనాడు ఉన్న రుగ్మతల మధ్యలో మన సమాజం యొక్క తరువాత స్థితి ఏమిటి? 2పేతురు 1:5-7 వచనాలు మనం చూసి నట్లయితే మనం మనలను జాగ్రత గలిగి ఈ రుగ్మతల నుండి పారిపొమ్మని హెచ్చరిస్తున్నది. మనం మారినప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం మారుతుంది అనుటలో సందేహమే లేదు. కావున దేవుని యందు భక్తితో పాపము నుండి తొలగి దానినుండి దూరముగా పరిగెడదాం. చేయగలినంత వరకు మన సమాజంలో మార్పులు మన సమాజంలో కలుగజెద్దాం.

- శ్రీమతి. మంజులా.

 

ప్రార్థన అంశం:-

ప్రతి నెల మనం సిద్ధపరుస్తున్న పత్రికలు ముద్రించుటకు మరియు మెయిల్ లో పంపించుటకు కావాల్సిన అవసరతలు సందింప బడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş