Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.08.2022
Share:

By Village Missionary Movement

Thursday, 25-Aug-2022

దిన ధ్యానము(Telugu) 26.08.2022

 

అంశం:- కొండెములు చెప్పుట వలన.

 

"కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును" - సామెతలు 26:20

 

మన ఇళ్ళల్లో , బంధువుల మధ్యలో , ఉద్యోగం చేసే స్థలాల్లో, రాజకీయాల్లో ఇలా చాలా చోట్ల గొడవలు, రావడం చాలా అధికం. వీటన్నింటికి ప్రాముఖ్యమైన కారణం ఒకటి అదేమనగా కొండెములు చెప్పడం.కొండెములు అనగా ఒకరి గురించి మరియొకరితో చెప్పడం. జగడములు చెప్పడం నుండి తప్పించుకొనుటకు తత్వవేత్త శాస్త్రవేత్త అయిన సాక్రిటిస్ ఒకరు ఒక సలహా ఇచ్చారు. తన విద్యార్థులలో ఒకడు ఆయనతో మీ స్నేహితులలో ఒకరిని గూర్చి నేను విన్నాను అన్నాడు. సాక్రిటిస్ తన విద్యార్థితో నువ్వు ఆ విషయాన్ని నాతో చెప్పే ముందు ఆ విషయం గురించి లోతుగా మూడు సార్లు ఆలోచించావా అని అన్నారు. ఆశ్చర్యముతో ఆయన వైపు చూసిన విద్యార్థితో ఏంటి లోతుగా ఆలోచించే కదా చెప్పావు అని అడిగి మొదటిగా నువ్వు నాకు ఆ విషయాన్ని చెప్పే ముందు అది 100%నిజమేనా? రెండవదిగా నువ్వు నాకు చెప్పబోయే విషయం మంచిదేనా? మూడవదిగా ఈ విషయం ఎవరికైనా ఉపయోగకరముగా ఉంటుందా? అని ఈ మూడు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ విద్యార్థి కాదు అని సమాధానం ఇచ్చారు. అందుకు సాక్రిటిస్ మంచిది కాని, ఎవరికి ఉపయోగం లేని ఆ విషయం నాకెందుకు చెప్పాలి అన్నారు. ఆ విద్యార్థి ఆలోచించడం మొదలు పెట్టాడు. జగడము చెప్పే కార్యం బాహ్యంగా పెద్ద పాపముగా కనిపించక పోయిన అది సమాజంలో చూపే ప్రభావం గోరమైనది. కాబట్టి యెహోవా మోషేకు దీని గురించి ఆజ్ఞాపించింది ఏమనగా. నీ ప్రజలలో కొండెములు అడుచు ఇంటింటికి తిరుగకూడదు. నీ సహోదరునికి ప్రాణ హాని చెయ్యకూడదు నేను యెహోవాను అని లేవీయకాండం 19:16 వ వచనంలో ఆజ్ఞాపించారు. సొలొమోను దీని గురించి మూర్కుడు కలహము రేపును, కొండెగాడు మిత్ర బేధము చూపును అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే కట్టెలు లేకపోతే అగ్ని ఎలా అరిపోతుందో కొండెగాడు లేకపోతే జగడము అలానే చల్లారిపోతుంది అని జ్ఞాని ఆయిన సొలొమోను చెబుతున్నాడు. అపోస్తులుడైన పౌలు కోరింథీ సంఘమునకు పత్రిక వ్రాస్తూ అనేక పాపముల కొరకు వారికి బోధించినప్పుడు కలహమున, క్రోధములు, అసూయ, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటను, అల్లరులును వుండునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ప్రియమైన వారలారా కొండెములు చెప్పే పాపము మీ యొద్ద ఉందేమో చూడండి. ఇతరుల గురించి ఏదైనా విషయాన్ని ఇంకొకరితో చెప్పినప్పుడు దేవుడు కూడా వాటిని వింటున్నారు అనే భయం మనలో ఉండాలి. సాక్రిటిస్ యొక్క సలహా మనకు సహాయం చెయ్యును గాక!

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు

 

ప్రార్థన అంశం'-

ప్రార్థన సమావేశ పత్రిక ద్వారా ప్రార్థన సమావేశాలను నడిపించుటకు కావలసిన సలహాలు, ప్రార్థన అంశాలు అనేకులకు ఉపయోగ కరముగా వుండులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al