By Village Missionary Movement
Wednesday, 24-Aug-2022దిన ధ్యానము(Telugu) 25.08.2022
అంశం:- దీని కొరకై త్వరపడు.
"మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము" - సామెతలు 3:27
మురళి అనే ఒకతను రోడ్డు పైన నడుస్తూ వెళ్తున్నప్పుడు అనేకులు గుంపు కూడి ఉండటం చూసి ఏం జరిగింది అని తెలుసుకొనుటకు ఆ గుంపు దగ్గరకు ఇతను కూడా వెళ్ళాడు. ఒకతను ప్రాణాలతో పోరాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మురళి హృదయం చాలా బాధతో నిండిపోయింది. ఎవరు సహాయం చెయ్యకుండా అలా చూస్తూ ఉన్నారు ఎందుకు అడిగాడు. 108 కు కాల్ చేసాము వస్తాము అని చెప్పారు. మరి కొందరు దీనిలో తలదూర్చి పోలీస్ స్టేషన్, కోర్ట్ చుట్టు తిరుగుతారు మనకెందుకు ఈ బాధ అన్నారు. మురళి సహాయం చేయుటకు ముందుకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారు సహాయం చెయ్య నివ్వలేదు. చివరిగా అవ్యక్తి అక్కడే మరణించాడు. పరిశుద్ధ గ్రంధంలో ఇలాంటి ఉపమానం పరిశుద్ధ గ్రంధంలో లూకా సువార్త 10: 30-35 చదివినట్లయితే ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్లుచుండగా దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ఆ దారిలో వచ్చిన యాజకుడు, లేవీయుడు అతనికి సహాయం చెయ్యలేదు. కాని ఒక సమరయుడు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసి అతనికి సహాయం చేసి అతనిని ఒక ఇంటిలో పెట్టి విడిచిపెట్టలేదు గాని తన దగ్గర ఉన్న డబ్బును అతని కొరకు ఖర్చు చేసాడు. వీరిలో ఆ సమరయుడే ఉత్తముడు అని చెప్పగలం.
పరిశుద్ధ గ్రంధం అతనిని మంచి సమరయుడు అని పిలుస్తుంది. నేడు మన సమాజంలో ఇటువంటి పరిస్థితిలను చూసినప్పుడు ప్రక్కకు తొలగి పోయిన యాజకుడు, లేవీయుడు వంటి వారు అధికముగా ఉన్నారు. మురళి వంటి వారు ఎవరైనా సహాయం చేయుటకు ముందుకు వచ్చినా సరే వారిని ఆటంక పరిచే పరిస్థితి మన సమాజంలో ఉన్నది. అందులో ముఖ్యముగా క్రీస్తు ప్రేమను ప్రకటించ వలసిన క్రైస్తవులే మనకెందుకు అని తొలగిపోయే స్థితి. ఏమని చెప్పగలం మనం చేయగలిగిన ఒక సహాయమును మనం ఇతరులకు చెయ్యకుండా ఉండడం కూడా పాపమే అని పరిశుద్ధ గ్రంధం మనలను హెచ్చరిస్తుంది. మన స్వార్ధపు ఆలోచన వలన ఒక ప్రాణం పోయింది అంటే దానికి మనమే భాద్యులము కాబట్టి ఇటువంటి సమాజ స్థితిని మార్చుటకు మనం చెయ్య గలిగినది మనం చేద్దాం. మార్పును మన నుండి మొదలు పెడదాం. హల్లెలుయా!
- శ్రీమతి. స్టెఫీ రాక్ సన్ గారు
ప్రార్థన అంశం:-
"యవ్వనురాలా విను" అనే యవ్వనస్తుల కొరకు ప్రత్యేకంగా ముద్రించ బడుతున్న పత్రికల ద్వారా యవ్వన పిల్లలు తమ యవ్వనత్వాన్ని కాపాడు కొనులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250