Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.08.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 24-Aug-2022

దిన ధ్యానము(Telugu) 24.08.2022

 

అంశం:- భిక్షగాళ్ళు.

 

"కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును" - లూకా 11: 41

 

కర్ణాటక లోని బళ్లారి జిల్లాకు చెందిన హిచా బాష్యా అనే 45 సంవత్సరాల వయస్సు గల ఒక మానసిక వికలాంగ బిక్షకుడు ఉన్నాడు. అతడు ఆ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన బిక్షగాడు. ఇతనికి ఎవరైనా బిక్షం ఇస్తే వారి యొద్ద నుండి ఒక్క రూపాయి మాత్రమే తీసుకొంటాడు. మిగిలిన డబ్బులను తిరిగి వారికే ఇచ్చేస్తాడు. బలవంతం చేసి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాటిని తీసుకొనుటకు ఒప్పుకొనడు. ఇతరులు వాడికి డబ్బులు ఇచ్చినప్పుడు వారిని నవ్వుతూ దీవిస్తాడు మరియు వారిని ఇబ్బంది పెట్టడు. అతడు కొన్ని నెలలు క్రితం ఒక బస్సు ఢీకొని మృతి చెందాడు. ఆ ప్రాంతంలో ఉన్న వివిధ సంస్థలు, దుకాణ దారులు ఇతర వ్యక్తులు బస్సులు ఏర్పాటు చేసి అతని అంతిమయాత్ర సిద్ధం చేశారు. అతని యొక్క అంతిమయాత్రలో ఇంచు మించి 4000 మంది పాల్గొన్నారు. బిక్షకుడు కొరకు ప్రజలు చూపించిన ఆందోళన ఇతరులను ఆలోచింప జేసింది. 

 

పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఒక గ్రుడ్డి బిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు అటువైపు వస్తున్నారు అని విని దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాడిని ఒక బిక్షగాడు అని త్రోసివేయ లేదు, నిర్లక్ష్యం చేయలేదు. ఆయన అతనిని పిలిచి నేను నీకు ఏమి చేయవలెనని నీవు ఎదురుచూస్తున్నావు అని వాడిని అడిగి అతనికి దృష్టి కలుగజేశాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! భిక్షగాళ్ళను తక్కువుగా అంచనా వేయకూడదు. అదే విధంగా భిక్షగాళ్ళను వేచి ఉంచకూడదు. సమస్తము కోల్పోయిన స్థితిలో చేయి చాపుతున్నాడు ఒకడు. అన్ని ఉన్నను ఇచ్చుట మర్చిపోతున్నాడు ఇంకొకడు. వీరిద్దరిలో ఎవడు బిక్షగాడు కొంచం ఆలోచించి చూద్దాం. అనేక సమయాల్లో మనం వాళ్ళను చూసి కోపంగా మాట్లాడే మాటలు సమాజం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, కుటుంబీకుల ద్వారా ఏర్పడే గాయాలను ఇంకా ఎక్కువ చేస్తాయి. ప్రభువైన యేసు అలానే బోధించారు కదా! ఆయన ఇలా త్రోసివేయబడిన వారిని వెతుక్కుంటూ వెళ్లి సేవ చేశారు. మనం కూడా ఆ కార్యములను వెంబడించాలి అని ఆయన ఆశ పడుతున్నారు. మరి ఇటువంటి వ్యక్తులతో ఎన్ని సార్లు ఆ శక్తితో మనం మాట్లాడామో ఆలోచిద్దాం. మనం వారికి సహాయం చేయలేకపోతే కొన్ని మాటలు ప్రేమతో మాట్లాడి గాయపడిన వారి హృదయానికి వైద్యంలా అందిద్దాం. మన పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి దినాల్లో ఖర్చు చేసి డబ్బులు తీసుకొని వచ్చి వీరికి సహాయం చెయ్యవచ్చు. ఇదే దేవుడు ఎదురు చూసే ప్రేమ. హల్లెలుయా!

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

సేవకుల కొరకు సిద్ధం చేస్తున్న పత్రికల ద్వారా ఈ అంత్య కాలంలో అనేక మంది సేవకులు ఉజ్జీవం పొందుకొనులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş