Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.08.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 23-Aug-2022

దిన ధ్యానము(Telugu) 23.08.2022

 

అంశం:- మీరు పనిచేయ కుంటే

 

“తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా” – మత్తయి 20:6

 

భారత దేశంలో గల మధ్యప్రదేశ్ రాష్ర్టంలో పదివేల మంది యువకులు కేవలం తక్కువ నైపుణ్యం కలిగిన 15 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టారు. అందులో పోటీ పరీక్షకు సిద్ధం అయిన జితేంద్ర మౌరియా ఒకరు. దరఖాస్తు దారులలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగిన వారు, ఇంజినీర్లు, ఎం.బి.ఏ చేసిన వారు అందరూ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యారు. ఉద్యగం కోసం ఇంటర్వూ కు వచ్చిన జితేంద్ర మౌరియా ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ కొన్ని సార్లు పోటీ పరీక్షకు కావాల్సిన పుస్తకాలు కొనుటకు కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. అందుకే నాకు ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది అని వచ్చాను అన్నారు. జితేంద్ర మాటలు భారత దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని చూపిస్తుంది. ఇప్పటికి మాంద్యం ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి, మరియు ఉక్రేన్ రష్యా మధ్య యుద్ధం వంటి అనేక సమస్యల వలన భారత దేశం దిగజారిపోతోంది. ఇటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు మరియు నిరుద్యోగాన్ని పెంచింది. ఇదంతా గమనిస్తున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తు కొరకు భయం కనిపిస్తుంది. 

 

ప్రియమైన వారలారా! వీటికి భయ పడాల్సిన అవసరం లేదు. మీ పనులను ప్రభువు చేతికి అప్పగించండి. మరియు ఆయనపైన నమ్మకమును ఉంచండి ఆయన మీ కార్యం నెరవేర్చును అని బైబిల్ చెబుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మన చదువులు, ఉద్యోగాల గురించి చింతించకండి. మన ప్రభువు మనలను గమనిస్తున్నారు మరియు మనకు సహాయం చేసేవారు. ప్రభువైన యేసుక్రీస్తు కోత విస్తారం గాని పనివారు కొద్దిగా వున్నారు అని పిలుస్తున్నారు. మరియు ద్రాక్ష తోటలో పని చేయుటకు ఊరకనే ఉన్న వారిని ప్రభువు పిలవడం మనం చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆయన సేవచేయుటకు ప్రభువు పిలుస్తున్నారు. దేవుని సేవకు పనివారిని ప్రభువు పిలుస్తున్నారు. యేసుని ఎరుగక నరకం వైపు వెళ్తున్న ప్రజలను సందించుటకు మీరు వస్తారా?

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు. 

 

ప్రార్థన అంశం:-

దేవుడు మనకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రతి రాష్టంలో 12 మంది మిషనరీలను దేవుడు దయ చేయులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş