Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.08.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 21-Aug-2022

దిన ధ్యానము(Telugu) 21.08.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

అంశం:- వేస్ట్ చెయ్యవద్దు.

 

"మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము" - మత్తయి 6: 11

 

హాలో పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనం చేసారా? రోజుకు ఎన్ని సార్లు భోజనం చేస్తారు? ఓహో నాలుగు సార్లు తింటారా. మంచిది అయితే మీరు తినేటప్పుడు ఆరోగ్యవంతమైన భోజనం తినాలి. జంక్ ఫుడ్స్ తినకూడదు. ఓకేనా! వట్టి చారు అన్నం దొరికిన లేక బిర్యానీ దొరికిన ఏ ఆహారం దొరికిన జీసస్ కు థాంక్స్ చెప్పి తినాలి. చెప్తారు కదా! సరే ఇప్పుడు కధ విందామా!

 

ఒక రోజు ఒక ఇంట్లో ప్రేయర్ మీటింగ్ జరిగింది. మీటింగ్ లో భోజనాలు పెట్టడం వలన చిన్న పిల్లలు అందరూ తినడం మొదలు పెట్టారు. ఒక చిన్న పాప కొంచం మాత్రమే తిని మిగిలిన భోజనములో చేతులు కడిగేసుకుంది. మీరు తినకపోతే మీ అమ్మ నాన్నలకు ఇచ్చేయాలి. మీరందరూ ఫుడ్ వేస్ట్ చెయ్యరు కదా! మీరు మంచి పిల్లలు.

 

ఈ చిన్న పాపను చూసిన తాతయ్య వేగంగా వచ్చి ఆ ప్లేట్ లో ఉన్న నీటిని మాత్రమే క్రింద పారబోసి ఆ ప్లేట్ లో ఉన్న ఫుడ్ లోనే మరికొంత ఫుడ్ వేసుకొని తిన్నారు. ప్రక్కనే ఉన్న ఇంకొక తాతయ్య మీరేంటి చేతులు కడుకొన్న ఆ ఎంగిలి ప్లేట్ లో తింటున్నారు అని అడిగాడు. అందుకు ఆ తాతయ్య యేసయ్య ఇచ్చిన ఫుడ్ ని వేస్ట్ చెయ్యకూడదు కదా! ఆ చిన్న పాపకు తెలియదు ఈ ఆహారం దొరక్క ఎంతోమంది చిన్న పిల్లలు ఆకలితో నిద్ర పోతున్నారు అని చెప్తూ ఆ ఆహారాన్ని అస్వదిస్తూ తినేశారు. దానిని విన్న ప్రక్కనే ఉన్న తాతయ్య ఇకనుండి నేనుకూడా ఇలానే చేస్తాను అని అన్నారు. ఇకనుండి ఫుడ్ వెస్ట్ చెయ్యకూడదు అని మా కుటుంబీకులకు కూడా చెప్తాను అనే నిర్ణయంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

 

ఏంటి పిల్లలు స్టోరీ సూపర్ గా ఉందా ? అయితే మరి మీరు కూడా ఆహారాన్ని వేస్ట్ చెయ్యకూడదు అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా నేర్పించాలి. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వెజ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి నేను వెజ్ తినను అని అల్లరి చెయ్యకూడదు. డైలీ మీకు దొరికే ఆహారం జీసస్ ఇస్తున్నారు. దానిని వృధా చెయ్యకుండా ఉంటే ఆకలితో ఉన్న ఎవరికైనా దానిని ఇచ్చి వారి ఆకలిని తీర్చ గలరు కదా అవునా కదా?. ఈరోజు మనకు మంచి విషయాన్ని నేర్పించి నందుకు జీసస్ కు థాంక్స్ చెబుదామా. థాంక్స్ జీసస్.

- సిస్టర్. దేబోరా.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş