Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.08.2022
Share:

By Village Missionary Movement

Friday, 19-Aug-2022

దిన ధ్యానము(Telugu) 20.08.2022

 

అంశం:- మీ సాంప్రదాయాలు.

 

"మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు" - మత్తయి 15:9

 

ఒక సంఘంలో రేడియో ద్వారా వచ్చే ప్రకటన నా దృష్టిని ఆకర్షించింది. మీరు క్రైస్తవ్యం గురించి ఎరిగి యున్నారు కాబట్టి మతం పై ఆశక్తి చూపించ కుండా ఉండవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మతం పైన ఆశక్తి చూపలేదు అనే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించ కుండ ఉండవచ్చు. కాని ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి మరియు ఒకరి యెడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి అని బోధించారు. ఇంకా మా సంఘంలో ప్రతి కార్యం మీకు ఇష్టం లేక ఉండవచ్చు. కాని మనం బలమైన సంబంధం కలిగి ఉన్నాం. దేవున్ని ప్రేమించడం, ఒకరిని ఒకరు ప్రేమించు కోవడం మేము నేర్చుకొంటున్నాం. మీరు ఆహ్వానితులు అని ఆ ప్రకటనలో చెప్పబడింది. 2000 సంవత్సరాలకు ముందు భూమిపైకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించి మత నాయకుడిగా మారాలి అని రాలేదు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు కొన్ని సూత్రాలు నిర్దేశించడం ద్వారా మతాన్ని స్థాపించాలి అని మరియు అభివృద్ధి చేయాలి అని కోరుకొంటున్నారు. ఇలా చెయ్యడం వలన ప్రజలకు ఏదైనా లాభం కలుగుతుంది అంటే మతం పేరుతో మనుష్యులు సంపాదించుకున్న పాప పుణ్యాలు మాత్రమే.

 

ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సేవ రోజుల్లో మతం పేరుతో అత్యుత్సాహమును కలిగి ఉన్న పరిసయ్యులతో మరియు సద్దుకయ్యులతో కఠినముగా మాట్లాడారు. సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే మతాధికారులు కనికరమును, న్యాయమును, దేవుని జ్ఞానమును విడిచిపెట్టారు అనే దానిని గురించి యేసు క్రీస్తు తన సేవ రోజుల్లో సరిగ్గా బోధించారు. నేడు ప్రపంచంలో కోట్లకొలది ప్రజలు తమ సొంత మతాన్ని అనుసరిస్తున్నారు. మరియు తమ సాంప్రదాయాలకు, ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాని క్రైస్తవ్యం సాంప్రదాయం కాదు. నిజమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తును మరియు ఆయన మాటలను విని వాటిని వెంబడించడమే ఒక మనుష్యునికి ఇవ్వబడిన ప్రధాన మైన ఆజ్ఞ అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది వింటున్న మీరు మతం పేరుతో భిన్నంగా ఉండవచ్చు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఒక మనుష్యునికి మతం ముఖ్యం కాదు మానవత్వంతో ప్రభువైన దేవున్ని ఆరాధించడమే ప్రాముఖ్యం అని. ప్రభువు మీకు సహాయం చెయ్యును గాక. ఆమెన్!

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు. 

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో ప్రతి శనివారంనాడు జరుగుతున్న ఉజ్జీవం ఆశించే వారి కూడిక లోనికి అనేకులు వచ్చి పాల్గొనులాగున మరియు అక్కడ ఉజ్జీవం కలుగులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al