By Village Missionary Movement
Sunday, 14-Aug-2022దిన ధ్యానము(Telugu) 14.08.2022 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లలకు.
కంఠత వాక్యం:-
"మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను" - మత్తయి 21:22
హాలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా. ఒక రోజు జెన్నీకి సెలవు రోజు కావడంతో బాగా నిద్రపోయింది. మీరందరూ సెలవు రోజున పగలు పడుకొంటారా? పడుకోరా? ఓహో అస్సులు నిద్రే రాదా సరే సరే. పడుకొని ఉన్న జెన్నీని వాళ్ళ నాన్న లేపారు. ఈరోజు మన ఊర్లో సువార్త కూటము రెండవ రోజు కదా బయలుదేరమ్మ వెళదాం అని చెప్పిన వెంటనే జెన్నీ త్వరత్వరగా బయలుదేరింది. వేసవి కాలం కావడంతో ఎండ చాలా ఎక్కువగా ఉండేది. అలానే కరువు ఆ గ్రామాన్ని కదిలించేసింది. జరగబోతున్న కూటములో వర్షం కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన జరగబడును అని గుర్తుకు వచ్చి ఒక గొడుగు తీసుకొని వెళ్ళింది జెన్నీ. జెన్నీ భోజనం చెయ్యకుండా ఉపవాసంతో కూటమునకు బయలుదేరింది. తన విశ్వాసమును చూసిన తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అప్పుడు కుటుంబం అంతా కలిసి సువార్త కూటమునకు బయలుదేరి వెళ్లారు. జెన్నీ చేతిలో ఉన్న గొడుగును చూసిన తండ్రి సాయంత్రపు కూటమునకు గొడుగు ఎందుకు అని అడిగారు. నాన్న ఈరోజు మనం వర్షం కొరకు ప్రార్ధించబోతున్నాం యేసయ్య మంచి వర్షమును కురిపిస్తారు అప్పుడు మనం తిరిగి ఇంటికి రావాలి అంటే గొడుగు ఉండాలి కదా అని చెప్పింది. దానిని విన్న తల్లిదండ్రులు మారు మాట ఆడలేదు. కూటము మొదలయ్యింది వర్షం కొరకు ప్రార్దించి ప్రసంగించడం మొదలు పెట్టారు. మధ్యలో ఉరుములు ఉరిమి మెరుపులు మెరవడం మొదలుపెట్టింది. జెన్నీ వాళ్ళ నాన్న వైపు చూసి దేవుడు మన ప్రార్ధనకు జవాబు ఇచ్చారు అని చెప్పినట్లు ఉంది తన మొఖం. తండ్రి, కూతురు ఇద్దరు చుట్టూ తిరిగి చూసారు మేఘాలు విపరీతంగా చుట్టుముట్టాయి. ప్రసంగం అయిపోయి ఆమెన్ అని చెప్పిన వెంటనే చినుకులు పడటం మొదలు పెట్టాయి. అందరూ తమ యొక్క బైబిల్ మరియు పాటల పుస్తకాలు తడిసిపోకుండా పట్టుకొని ఎవరి దారిన వారు ఇంటికీ పరిగెత్తారు. జెన్నీ తాను తీసుకొని వచ్చిన పాలిథిన్ సంచిలో బైబిల్ మరియు పాటల పుస్తకం పెట్టి గొడుగును విప్పింది. తన విశ్వాసం చూసిన తల్లిదండ్రులు కూడా గొడుగులను తీసుకొని వచ్చారు. కాబట్టి కుటుంబం అంతా తడిసిపోకుండా కలిసి దేవున్ని స్తుతిస్తూ ఇంటికి వెళ్లిపోయారు.
పిల్లలు జెన్నీ దేవుని పైన ఉంచిన విశ్వాసం వృధా కాలేదు చూసారా! మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు అద్భుతం చేస్తారు అని వేటినైన అడిగినప్పుడు నిశ్చయముగా అవి దొరుకుతాయి. విశ్వాసముతో అడిగి పొందుకోనండి నమ్మశక్యముకాని అద్భుతములను చూస్తారు. సరే పిల్లలు విశ్వసించి ప్రార్ధించినప్పుడు దేవుడు దయచేస్తారని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఒక కంఠతవాక్యం నేర్చుకుందామా?
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250