Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.08.2022
Share:

By Village Missionary Movement

Friday, 12-Aug-2022

దిన ధ్యానము(Telugu) 13.08.2022

 

అంశం: బాల కార్మికులు.

 

"ఏడ్చువారితో ఏడువుడి" - రోమీయులకు 12:16

 

మన దేశంలో పేదరికం కారణంగా వచ్చిన సామాజిక దురాచారాలలో బాల కార్మికులు అనేది ఒకటి. నిర్దిష్ట వయస్సు వచ్చిన వెంటనే వారిని పెంచలేక వారి తల్లిదండ్రులు వాళ్ళను పనులకు పంపుతున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అనాధలుగా మారడంతో వారు కూడా పనులు చెయ్యవలసి వస్తుంది. ఇళ్లల్లో, రెస్టారెంట్ లో, ఫ్యాక్టరీలలో పిల్లల యొక్క శ్రమ దోపిడీకి గురి అవుతుంది. పటాసులు, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలలో పనిచేసే పిల్లలు శ్వాసకోశ సమస్యలతో, చర్మ వ్యాధులతో, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాలలో చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. కొంత మంది సరిగ్గా పనిచేయకపోతే వేధింపులకు గురి అవుతున్నారు. బాలికలు అయితే లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. పిల్ల యొక్క వేళ్ళు మృదువుగా ఉండడం వలన నాలుగు సంవత్సరాల నుండే పనులకు వెళ్తున్నారు. చివరికి వారి కంటి చూపు మసక బారుతుంది. వెన్నుపూస వంగిపోతుంది. వారి చిన్న నాటి ఆటలను మర్చిపోతున్నారు. వారి మనస్సు కఠినముగా మారడం వలన వారు పెరిగే కొద్దీ నేరస్తులుగా మారిపోతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని కరిగించే ఈ కార్యం మన హృదయాలను కూడా కరిగించాలి. మనం విరిగి నలిగిన మనస్సుతో చెప్పబడిన అంశాలను గూర్చి ప్రార్థిస్తే శక్తిమంతుడైన దేవుడు పరిస్థితులను మార్చగలరు. 

 

1. దారిద్ర్యం లో ఉన్న ప్రజల జీవనోపాధిని పెంచేటట్లు ప్రార్దిద్దాం.

 

2. పేదలకు సబ్సిడీ ఆహారం మరియు వారికి అవసరమైన వస్తువులను అందించబడేలా ప్రార్దిద్దాం.

 

3. పేదలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉచిత సరుకులు అందేలా ప్రార్దిద్ధాం. 

 

4. పేద తల్లిదండ్రులకు ఉచిత విద్య అందేలా మరియు తల్లిదండ్రులు పిల్లలు అందరిని పాఠశాలలకు పంపిచేలా, చదువు మానేసిన పిల్లలు మరలా స్కూల్ కు వెళ్లేలా ప్రార్దిద్దాం.

 

5. అనాధాలకు ఆశ్రయం కల్పించేలా ప్రార్దిద్దాం. ప్రార్ధించుట మాత్రమే కాదు బాలకార్మికుల యజమానులను అరికట్టేలా ప్రయత్నం చేద్దాం. తక్కువ జీతం ఇచ్చి మన ఇళ్ళల్లో పనికి పెట్టుకోకూడదు. వీలైతే వారి చదువులకు సహాయం చెయ్యాలి. 

 

ప్రియమైన వారాలరా! మనం వీటిని చేస్తే ప్రభువు మన యెడల సంతోషిస్తారు. ఆమెన్.

- శ్రీమతి. గీతా రిచర్డ్.

 

ప్రార్థన అంశం:-

ప్రతి శనివారం జరుగుతున్న ఉజ్జీవ కూటములకు ఉజ్జీవం ఆశించేవారు అధికముగా పాల్గొనులాగున మరియు ఉజ్జీవం పొందుకోనే లాగున ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet