Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.08.2022
Share:

By Village Missionary Movement

Thursday, 11-Aug-2022

దిన ధ్యానము(Telugu) 11.08.2022

 

అంశం: అపరిమిత తప్పులు.

 

"నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము" - సామెతలు 23:26

 

విదేశంలో ఉద్యోగం చేస్తున్న తన భర్త కొన్ని వారాల క్రితం చనిపోయాడు అనే వార్త విని ఇది ఒక మోసానికి సంబంధించిన కేసు అని పోలీస్ స్టేషన్ కు వచ్చింది భార్య. విదేశంలో ఉద్యోగం చేస్తున్న ఆ వ్యక్తి తన భార్య తనతో సరిగ్గా మాట్లాడం లేదని గ్రహించి భారత దేశానికి వస్తున్నాడు. అప్పుడు తన భార్య ఇంట్లో లేదని ఎరిగి తాను వేరొకరితో సంబంధం పెట్టుకొని తనను విడిచి పెట్టి వెళ్ళిపోయిందని తెలుసుకున్నాడు. తన భర్త బ్రతికి ఉండగానే చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ పొందుకొని తనకు రావాల్సిన 25 లక్షలు భీమా డబ్బులు తాను తీసుకున్నది అని విని చాలా బాధతో కృంగి పోయాడు. ఇప్పుడు ఇటువంటి విచిత్రమైన సంఘటనలు ప్రతి స్థలాల్లో జరుగుతున్నాయి. ఒక మనుష్యుని యొక్క కన్నులు, హృదయం అదుపులో లేనప్పుడు అవి ఎంత కీడును కలుగజేస్తున్నాయో సామెతలు పుస్తకం చాలా చోట్ల మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం పైన చూస్తున్న వాక్యంలో నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని ప్రభువైన యేసు మనకు అడుగుతున్నారు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను అని పౌలు కోరింధీయులకు వ్రాశాడు. క్రమముగా వ్యక్తిగత ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంధం చదివే అలవాటు లేని వాడు జీవితంలో చాలా కార్యాలలో దారి తప్పిపోతాడు. ఒక వ్యక్తి యొక్క సంరక్షణ లేదా ఒక కుటుంబం అంతటి యొక్క సంరక్షణ అనేది వారు ఎంతగా ప్రభువైన యేసుని ఆనుకొని ఉన్నారో తెలియజేస్తుంది. 

 

ప్రభువైన యేసు క్రీస్తులో ప్రియమైన వారలారా! మునుపెన్నడూ లేని విధంగా ప్రజల్లో పాపము బయలు పడుతుంది. మరియు చాలా మంది నియంత్రణను కోల్పోయారు. అంతే కాదు నీవు యవ్వనేచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. కన్నులను, హృదయాన్ని ఎలా కాపాడుకోవలో తెలియని వారు జీవితంలో నిశ్చయముగా దారి తప్పిపోతారు. కాబట్టి దేవుని యొక్క సహాయమును కోరుకొనండి జాగ్రత్తగా ఉండండి. విజయముతో జీవించుటకు ప్రభువు మనకు సహాయం చేస్తారు. 

- బ్రదర్. పి.జాకబ్ శకంర్ గారు.

 

ప్రార్థన అంశం:-

హాస్పిటల్ పరిచర్య ద్వారా సంధింప బడుతున్న రోగులు ప్రభువుని అంగీకరించి స్వస్థత పొందుకొనేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet