Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.08.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 10-Aug-2022

దిన ధ్యానము(Telugu) 10.08.2022

 

అంశం: క్షమించే గొప్పతనం.

 

"నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను" - మత్తయి 18: 33

 

మనం అధునాతన ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎక్కడ చూసినా సి సి టి.వి కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ప్రముఖ్యంగా రైల్వేస్టేషన్ లో, ఆఫీసులో, అలాగే ఇళ్ళలో కూడా అమర్చబడి ఉన్నాయి. అందులో మనం గమనించ వలసిన విషయం ఏమిటి అంటే వాటిలో రికార్డ్ అయ్యేవాటిని మరల తిరిగి చూసుకొనవచ్చును. కాని ఆ కెమెరాలో ఉన్న రికార్డ్ ను మనం దాచలేము కదా. పరిశుద్ధ గ్రంధంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పబడినది. ఒక దాసుడు తన యజమానుని యొద్ద 10,000 దేనారములు అప్పు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించుటకు అతనికి స్తోమత లేదు. కాబట్టి ఆ దాసుడు తన యజమానుని యొద్దకు వెళ్ళి సాగిలపడి మ్రొక్కి నాయెడల ఓర్చుకోనుము నీకు అంతగా చెల్లింతును అని చెప్పాగా యజమానుడు అతనిని క్షమించాడు. ఎంతటి మంచి యజమానుడో చూడండి. క్షమాపణ పొందుకున్న ఆ దాసుడు తన యొద్ద 100 దేనారములు అప్పు తీసుకొన్న తోటి దాసుల యెడల కఠినముగా ప్రవర్తించడం అనేది బాధకరమైన విషయం. ఆ దాసుడు తన తోటి దాసుని యొక్క గొంతు పట్టుకొని తక్కువ డబ్బు ఇచ్చియున్న అతనిని అదుపులోనికి తీసుకున్నాడు. ఎంతటి అన్యాయం. మత్తయి సువార్త 18:31వ వచనంలో చూసినట్లయితే వాడి తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి జరిగినది అంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అందుచేత వాడి యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నది అంతయు చెల్లించు వరకు బాధ పరుచు వారికి వానిని అప్పగించెను. 

 

ప్రియమైన వారలారా! మన ప్రభువు క్షమించే మనస్సు గల వారై యున్నారు. మనము కూడా ఆయన వలె ఉండాలి అని ఆశ పడుతున్నారు. అది న్యాయమే కదా మత్తయి సువార్త 18:33లో నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింప వలసి యుండెను గదా అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నారు. మనం సమాజంలో సామరస్యంగా శాంతి కలిగి జీవించాలి అంటే క్షమించే స్వభావం చాలా ముఖ్యం. మనలను క్షమించే వారిని మనం ప్రేమించాలి. మన యొద్ద అప్పు తీసుకున్న వారిని క్షమించ కుండా కోపపడినప్పుడు మనలను క్షమించిన ప్రభువును మర్చిపోతున్నాం అని అర్థం. మనం మరచిన దాచిపెట్టిన ప్రభువు వాటన్నింటిని ఎరిగి యున్నారు. మనం ఇతరులను క్షమించడం వారు మన యొద్ద తీసుకొన్న అప్పును దాచిపెట్టడం వంటి స్వభావం కలిగిన వారి వలె మారినప్పుడు మనం జీవించే ఈ సమాజంలో మన ద్వారా ఒక చిన్న మార్పు అయిన కలుగుతుంది. 

- బ్రదర్. శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఆకలిగా ఉన్న వారికి అన్నం అందించే కార్యక్రమం ద్వారా అనేకులు పోషింప బడేలా మరియు వారందరూ ప్రభువును తెలుసుకొనేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet