Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.08.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 09-Aug-2022

దిన ధ్యానము(Telugu) 09.08.2022

 

అంశం: సమయాన్ని వృధా చెయ్యడం.

 

"దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి" - ఎఫెసీయులకు 5:15-16

 

ఒక రాజు తన దేశంలో జీవిస్తున్న ఒక పేద వానికి రాజా భవనం యొక్క తాలపు చెవులను ఇచ్చి ఈరోజు చీకటి కాక మునుపు నీకు అవసరమైన వాటిని తీసుకొనుము అని చెప్పాడు. ఈ వ్యక్తి కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి తన భార్యతో ఈ విషయాన్ని తెలియజేశాడు. భార్య కూడా సరే వెంటనే వెళ్లి తీసుకొని రండి అని చెప్పింది. కాని ఆ వ్యక్తి నేను సంతోషాన్ని పట్టలేక పోతున్నాను కాబట్టి నాకు రాజుల భోజనం వండి ఇవ్వు అని చెప్పి నిద్రపోయాడు. అతను కళ్ళు తెరిచి చూసే సరికి సాయంత్రం అయిపోయింది. త్వరత్వరగా నడుచుకొంటూ రాజ భవనమునకు వెళుతున్న దారిలో మామిడి చెట్టును చూడగానే మామిడి పండ్లను కోసుకుని తినడం మొదలు పెట్టాడు. చివరిగా అతను రాజ భవనానికి వెళ్లడానికంటే ముందే చీకటి పడిపోయింది. త్వరత్వరగా రాజ భవనములోనికి వెళ్తున్న అతనిని చూసిన రాజు నీకు ఇవ్వబడిన మంచి అవకాశం కోల్పోయావు అని చెప్పి అతనిని బయటకు పంపివేశాడు. మనుష్యునికి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన సంపద సమయం. చాలా సార్లు మనకు ఇవ్వబడిన సమయాన్ని వృధా చేసి ఆశీర్వాదములను కోల్పోతున్నాం. మన జీవితంలో విలువైన సమయాన్ని వృదాచేసే కొన్ని విషయాలు గూర్చి ఇప్పుడు మనం ధ్యానిద్దాం. 

 

1. తోటి వ్యక్తుల నుండి ప్రేరణను ఆశించి బాహ్యమైన కార్యములు కొరకు వేచి ఉండి సమయాన్ని వృధా చెయ్యడం.

 

2. ఇతరులు మన కొరకు ఏం అనుకొంటున్నారో అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ పనువులను చెయ్యకుండా ఉండిపోవడం. 

 

3. ఆటంకంగా ఉన్న పరిస్థితులను గూర్చి లోటుగా మాట్లాడుతుండడం.

 

4. ఇతరులతో మనలను పోల్చి చూస్తూ సమయాన్ని వృధా చెయ్యడం.

 

5. ఒకసారి తప్పిపోవుట అనేది సాదారణమైన విషయం కాని చేసిన తప్పు మరలా మరలా చేసి సమయాన్ని వృధా చెయ్యడం.

 

6. మన జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న విషయాలకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా వాటిని ప్రక్కకు త్రోసివేసి పనికి రాని విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చి సమయాన్ని వృధా చెయ్యడం. 

 

7. అపజయాన్ని చూసి కృంగి జీవితంలో పై స్థానానికి వెళ్లకుండా ఆగిపోవడం. 

 

ప్రియమైన వారలారా! అపోస్థలుడైన పౌలు ఎఫెస్సియులకు వ్రాసిన పత్రికలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమున పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోనుడి అని చెప్పారు. మనం జీవిస్తూ ఉన్న ఈ సమాజంలో సమయాన్ని వృధా చేసే కార్యములు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి నుండి తొలగి ప్రభువునకు ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకు ఇచ్చి ఆయన పాదముల చెంత వేచి ఉన్నప్పుడు లోకపు కార్యములలో కృంగిపోకుండా జ్ఞానుల వలె జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్లగలం. ప్రతి దినం దేవుడు మనకు ఇస్తున్న అవకాశములను ఉపయోగించి ఆశీర్వద కరమైన విజయ వంతమైన జీవితాన్ని జీవించవచ్చు. ఆమెన్.

- శ్రీమతి. జబకాని శేఖర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఒక లక్ష గ్రామాలు సంధింప బడేలా 7000 మంది మిషనరీలను దేవుడు ఇచ్చులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet jojobet holiganbet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet casibom casibom ibizabet bettilt