Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.02.2021
Share:

By Village Missionary Movement

Saturday, 06-Feb-2021

దిన ధ్యానము(Telugu) 06.02.2021

ఎంచుకోబడిన పాత్ర.

"...నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన పాత్రయైయున్నాడు" - అపో.కార్యములు 9: 15

చీకటి ఖండము అని పిలవబడుతున్న ఆఫ్రికా దేశంలో సువార్త అనే దీపమును వెలిగించిన వ్యక్తి డేవిడ్ లివింగ్ స్టన్. స్కాట్లాండ్ దేశంలో పేద క్రైస్తవ కుటుంబంలో జన్మించిన లివింగ్ స్టన్ తన కుటుంబము యొక్క కఠోరమైన పేదరికం మధ్యలో కూడా కఠినమైన ప్రయసతో తన వైద్యపు చదువును పూర్తి చేసి దాంట్లో ప్రఖ్యాతి గాంచిన వాడిగా ఉండేవారు . ఆయన యొక్క 20వ సంవత్సరంలో "రాబర్ట్ మొఫట్ " అనే దేవుని దాసుడు ఆఫ్రికా గురించి అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి చెబుతున్నప్పుడు అక్కడకు మిషనరీగా వెళ్లుటకు తనను సమర్పించుకున్నాడు. 700 మైళ్ళు ప్రయాణం చేసి దట్టమైన అడవులలో దార్లు కనుక్కొని అనేక అడవి గ్రామములకు వెళ్లి ప్రజలను దర్శించి సువార్త పరిచర్య చేశారు. ఒకమారు ఒక ఆఫ్రికన్ ఆయన యొద్దకు వచ్చి " మీరెందుకు ముందే దేవున్ని మాకు ప్రకటించలేదు? మీ ఆలస్యం వల్లనే మా పూర్వీకులు దేవున్ని తెలుసుకోకుండా మరణించారు " అని అడిగారు.    దీన్ని విన్న లివింగ్ స్టన్ హృదయము పగిలిన వాడిగా ఇంకను అధికముగా తన శరీరపు బలహీనత మధ్యలో కూడా పరిచర్య చేశారు. దేవుడు ఎంచుకొనబడిన పాత్ర డేవిడ్ లివింగ్ స్టన్ . ఈయన జీవము గల రాళ్లుగా (లివింగ్ స్టోన్స్) ఈ దినము వరకు దేవుని భవనములో మెరుస్తూ ఉన్నారు. 

బైబిల్లో కూడా సౌలును దేవుడు తన పనికొరకు ఏర్పర్చుకొన్నారు. ఆయనను పౌలుగా మార్చి అన్య జాతులకు సువార్తను ప్రకటించే గొప్ప బాధ్యతను ఆయన చేతికి అప్పగించారు. పౌలు కూడా క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించి, అనేక దెబ్బలు మధ్యలో కూడ పరిచర్య చేశారు. చెరసాలలో ఉండినప్పటికి అనేకులను క్రీస్తు మార్గములోనికి నడిపించారు. పరిచర్య మార్గములో అనేక సేవకులను ఏర్పరిచి అనేక సంగములను తయారు చేసారు. 1కోరింది 1:11 ప్రకారము క్రీస్తు వలె జీవించి తన జీవితాన్ని నడిపిన వ్యక్తి పౌలు. 

ప్రియమైన వారాలరా! మన పూర్వీకులు, మనకు తెలిసిన వాళ్ళు ఎందరో యేసుక్రీస్తును ఎరుగక మరణించారు. ఇంకను ఒక సంతతి యేసుని ఎరుగకుండా అలాగే నరకానికి వెళ్లకూడదు. లివింగ్ స్టన్  వలె మిమ్మల్ని దేవుని కొరకు సమర్పించి చీకటిలో ఉన్న ప్రజలను యేసు అనే వెలుగులోకి నడిపిస్తారా? పౌలు వలె క్రీస్తు కొరకు పరిచర్య చేసి అనేక సేవకులను తయారు చేస్తారా? దేవుడు ప్రతి ఒక్కరిని తన పరిచర్య కొరకు ఎంచుకొనుటకు వెతుకుతున్నారు. దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తి మీరే మిమ్మల్ని మీరు దేవుని కొరకు మిషనరీగా సమర్పిస్తారా? ప్రతి క్రైస్తవుడు ఒక ఆత్మ సంపాదన యోధుడే అనేదాన్ని మార్చిపోకండి.
-    శ్రీమతి. ఎస్తేర్ గాంధీ రాజన్

ప్రార్థన అంశం:-
ఆత్మల యెడల భారం గల మిషనరీలు పార్ట్నర్ షిప్ మిషనరీలుగా మనతో పాటు ఐక్యపడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis